Election Literacy Clubs | వ్యాసరచన పోటీల్లో నందిపేట్​ విద్యార్థిని ప్రతిభ

ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నందిపేట్​ మండల విద్యార్థిని ప్రతిభ చూపింది.

shashi kiran Mottala

​అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Election Literacy Clubs | ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల (ELCs) ఆధ్వర్యంలో నిజామాబాద్(Nizamabad) జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నందిపేట్​ మండల విద్యార్థిని ప్రతిభ చూపింది. ఈ మేరకు నందిపేట్​ మండల ఎంఈవో వివరాలు వెల్లడించారు.

Election Literacy Clubs |ఈనెల 18న జిల్లాస్థాయిలో పోటీలు..

​భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈనెల 18న జిల్లాస్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించి మొదటి పది స్థానాల్లో నిలిచిన విజేతల వివరాలను, నివేదికను ఉప జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.

​Election Literacy Clubs | వ్యాసరచన పోటీల విజేతలు (టాప్-10) విజేతలు వీరే..

​ఎ. గుణశ్రీ (90 మార్కులు) – అక్షర పబ్లిక్ స్కూల్ (ఈఎం) హైస్కూల్, నందిపేట (ఆర్మూర్ నియోజకవర్గం), ఎస్.కౌముది (90మార్కులు) – వాసవి హైస్కూల్, బాన్సువాడ (బాన్సువాడ నియోజకవర్గం), ​బోడ పవన్ (90మార్కులు) – ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల, బాన్సువాడ (బాన్సువాడ నియోజకవర్గం), సీహెచ్. అంజుమ్ (90మార్కులు) – టీజీఎంఆర్‌ఈఐఎస్ బాలికల-4, నిజామాబాద్ (నిజామాబాద్ అర్బన్), ​ఎల్. నితీష (90మార్కులు) – జడ్పీహెచ్‌ఎస్ రాంపూర్, డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్), ​కొలుటొమ్మి రషిత్రేయిని (85మార్కులు) – ఇందూర్ మోడల్ హైస్కూల్, బోధన్ (బోధన్ నియోజకవర్గం), ​ఎస్‌కే. సమీనా బేగం (85మార్కులు) – ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల, బాన్సువాడ (బాన్సువాడ నియోజకవర్గం), ​రిమ్షా బేగం (85మార్కులు) – జడ్పీహెచ్‌ఎస్ సుద్దపల్లి, డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్), ​పి. స్నిగ్ధ (85మార్కులు) – పీఎంశ్రీ టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ సుద్దపల్లి బాలికల పాఠశాల, డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్), ​జి. సాత్విక (85మార్కులు) – టీజీఎంఎస్ డిచ్‌పల్లి, డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్) ఉన్నారు.

ఇది కూడా చదవండి: మెట్రో దిగగానే… నేరుగా ఇంటి దగ్గరకే..! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *