Delimitation Bill | ‘డీలిమిటేషన్’ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. కేటీఆర్​ ప్రశ్న

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delimitation Bill | కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్​ బిల్లును ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెల 30 నుంచి జరగనున్న ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకు రానుంది. ఈ బిల్లుకు బీఆర్ఎస్​ పార్టీ మద్దతు తెలిపింది. తాజాగా బిల్లుపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

డీలిమిటేషన్​ బిల్లును కాంగ్రెస్​ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించేవారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దక్షిణాది వాటా 24శాతం పెరగడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అన్నారు. 19 శాతం వాటాకే పరిమితం చేయాలని భావిస్తుందా అని మండిపడ్డారు.

Delimitation Bill | రాజకీయ సుస్థిరత

ఏదైనా అనుమానం ఉంటే డీలిమిటేషన్ కమిషన్ ఉంది. పారదర్శకంగా చేయాలని మనందరం కొట్లాడాలని కేటీఆర్​ అన్నారు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాలను 153కు పెంచుతామని చెప్పారని గుర్తు చేశారు. కానీ 14 ఏళ్లుగా బీజేపీ అది అమలు చేయలేదన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు రాజకీయ సుస్థిరత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Delimitation Bill | దక్షిణాది రాష్ట్రాల విజయం

జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయకూడదని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటినుంచో చెబుతున్నామని కేటీఆర్​ అన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గి, జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, మన 24 శాతం వాటా తగ్గకుండా డీలిమిటేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇది దక్షిణాది రాష్ట్రాల విజయంగా భావించి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చామన్నారు.

దీనిని కూడా  చదవండి : Earthquake | ఎయిర్​పోర్టులో భూ ప్రకంపనలు.. వెనక్కి వెళ్లిపోయిన విమానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *