Delimitation Bill | మా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదు.. డీలిమిటేషన్​పై స్టాలిన్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delimitation Bill | డీఎంకే పార్టీ డీలిమిటేషన్​కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై పునరాలోచించుకోవాలని రాహుల్​ గాంధీ డీఎంకే అధినేత స్టాలిన్​ను కోరారు. దీనిపై స్టాలిన్​ స్పందించారు.

తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యతనిస్తూ తాము ప్రతి నిర్ణయం తీసుకున్నామని మాజీ సీఎం స్టాలిన్​ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, రాష్ట్రాల హక్కులను కాపాడటంలో డీఎంకే పోషించిన చారిత్రాత్మక పాత్రను గుర్తించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అన్నారు. ఈ మార్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, చరిత్ర తమను ఎట్టప్పన్‌లుగా కాకుండా కట్టబొమ్మన్‌లుగా గుర్తిస్తుందని అన్నారు. డీలిమిటేషన్​ విషయంలో తమ నిర్ణయంపై వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.

Delimitation Bill | రాహుల్​ ట్వీట్​

అంతకుముందు రాహుల్​ గాంధీ ఎక్స్​లో పోస్ట్ చేశారు. స్టాలిన్ ఎల్లప్పుడూ తమిళ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఒక బండరాయిలా నిలబడ్డారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం, తమిళనాడు ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, మనమందరం కలిసి ఈ బిల్లును ఓడించాలని కోరారు. ఈ మేరకు ఆయనను కలిసేందుకు చెన్నై వెళ్తున్నట్లు రాహుల్ ట్వీట్​ చేశారు. దీనికి స్టాలిన్​ స్పందిస్తూ తమ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు.

Delimitation Bill | అప్పుడు హ్యాండ్​ ఇచ్చి..

డీఎంకే పార్టీ ఏళ్లుగా కాంగ్రెస్​తో అనుబంధాన్ని కలిగి ఉంది. యూపీఏ కూటమిలో, ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించింది. ఇతర పార్టీలు కాంగ్రెస్​ను పెద్దన్నగా గుర్తించడానికి ఇష్టపడకపోయినా.. డీఎంకే ఆ పార్టీకి, రాహుల్​ గాంధీకి అండగా నిలిచింది. బెంగాల్​లో అధికారంలో ఉన్న సమయంలో మమతా బెనర్జీ కాంగ్రెస్​ను పట్టించుకోలేదు. అధికారంలో కోల్పోయాక కూటమి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో సైతం డీఎంకే పార్టీ కాంగ్రెస్​ను సపోర్టు చేసింది. ఆ విషయాలను పక్కన పెట్టిన కాంగ్రెస్​.. తమిళనాడులో డీఎంకే ఓడిపోగానే ఏళ్ల బంధాన్ని పక్కన పెట్టి టీవీకేకు మద్దతు తెలిపింది. ఫలితాలు వెలువడిన గంటల్లోనే అధికార పక్షంలో చేరడానికి సిద్ధం అయింది. అప్పుడు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్​ నాయకులు, తాజాగా డీలిమిటేషన్​ బిల్లుకు వ్యతిరేకంగా తమతో కలవాలని స్టాలిన్​ను కోరడానికి చెన్నై వస్తుండటం గమనార్హం. స్టాలిన్​ తన ట్వీట్​లో ఎట్టప్పన్​ అనే పదాన్ని ఉపయోగించారు. ఎట్టప్పన్​ అనే పదాన్ని నమ్మక ద్రోహానికి చిహ్నంగా వాడతారు. కాంగ్రెస్​ తమకు నమ్మకద్రోహం చేసిందనే కోణంలో ఆయన ఈ పదం వినియోగించినట్లు తెలుస్తోంది.

దీనిని కూడా చదవండి : Delimitation Bill | డీలిమిటేషన్​ బిల్లు.. స్టాలిన్​, శరద్​పవార్​తో భేటీ కానున్న ఖర్గే

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *