అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ మేరకు స్టాలిన్, శరద్ పవార్‌తో నేడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే సమావేశం కానున్నారు.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈరోజు చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో, ముంబైలో ఎన్‌సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్‌తో వేర్వేరుగా సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్టాలిన్‌ను కలిసి, ఆ తర్వాత రాత్రి 8 గంటలకు పవార్‌తో సమావేశం కోసం ముంబైకి ప్రయాణించనున్నారు. కాంగ్రెస్ సీఎంలు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ పార్టీల ప్రతినిధులు కూడా ఈ రెండు మిత్రపక్షాలతో చర్చల్లో పాల్గొననున్నారు.
Delimitation Bill | ఇప్పటికే స్పష్టం చేసిన పార్టీలు
ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయం తుది నిర్ణయమని ఎన్‌సీపీ(ఎస్‌పీ) చెప్పగా, దక్షిణ రాష్ట్రాలతో సహా సీట్లను 50 శాతం పెంచాలన్న తమ డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకున్న తర్వాత, సవరించిన ముసాయిదాకు మద్దతు ఇస్తామని డీఎంకె తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలతో చర్చల అనంతరం ఆ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది. ఆదివారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి ఖర్గేను కలిశారు.
Delimitation Bill | ఎన్డీఏ బలం 320 మంది ఎంపీలు
ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా అంత మంది ఎంపీల మద్దతు లేదు. ఎన్డీఏ అంచనా బలం సుమారు 320 మంది ఎంపీలు కాగా.. వీరిలో బీజేపీకి చెందిన 241 మంది సభ్యులు ఉన్నారు. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు, ఎన్‌సీపీఎస్పీ)కి చెందిన ఎనిమిది మంది ఎంపీలు కూడా తోడవడంతో, మొత్తం ఎంపీల సంఖ్య సుమారు 350కి చేరే అవకాశం ఉంది.
Senior leaders of the INDIA bloc and I are going to Chennai to meet Thiru @mkstalin and request him and the DMK to oppose the delimitation Constitutional amendment bills.
An expansion to 850 seats will finish democracy in India. It will give BJP-RSS unlimited space to redraw India’s entire electoral map to their advantage.
Brother Stalin has always stood like a rock against anti-Tamil forces. In the national interest, in Tamil Nadu’s interest and to protect the Constitution, we have to defeat this bill together.
— Rahul Gandhi (@RahulGandhi) November 29, 2026
దీనిని కూడా చదవండి : DGP CV Anand Nizamabad | పోలీసులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం..: డీజీపీ సీవీ ఆనంద్