Prakasam Road Accident | ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prakasam Road Accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టంగుటూరు టోల్‌గేట్ వద్ద కారును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున టోల్​ చెల్లించేందుకు ఓ కారు వేచి ఉంది. ఆ కారు ముందు ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు ఉంది. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బస్సు, లారీ మధ్య కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Prakasam Road Accident | ఓటు వేసేందుకు వచ్చి..

గ్రామానికి చెందిన ఆరుగురు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు శనివారం రాత్రి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో టంగుటూరు టోల్‌ప్లాజా వారి కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్​ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Prakasam Road Accident | అత్యంత బాధాకరం

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్​లో చికిత్స పొందుతున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

దీనిని కూడా చదవండి : HMDA Land Auction | హెచ్​ఎండీఏ భూముల వేలానికి స్పందన కరువు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *