అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HMDA Land Auction | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు భూముల వేలానికి స్పందన లభించలేదు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ– వేలం నిర్వహించగా… ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు.
నగరంలోని మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూముల వేలాన్ని శుక్రవారం హెచ్ఎండీఏ నిర్వహించారు. రెండు విడతలుగా ఈ – వేలం ప్రక్రియ నిర్వహించగా.. బిడ్డర్లు ఆసక్తి చూపలేదు. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు.
HMDA Land Auction | 8 ఎకరాలకు వేలం
మూసాపేట ట్రక్ పార్క్ 3.15 ఎకరాలు, కోకాపేట నియోపోలీస్ లో 4.59 ఎకరాల భూమిని వేలం వేయాలని అధికారులు భావించారు. మూసాపేట భూములకు ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా, నియోపొలిస్ భూములకు ఎకరా కనీస ధర రూ.120 కోట్లుగా నిర్ణయించారు. ఇటీవల గచ్చిబౌలి, నియోపాలిస్ ఇతర ప్రాంతాల్లో భూములు రికార్డు ధర పలుకగా.. తాజాగా బిడ్డర్లు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ట్రక్ పార్కు భూముల వేలాన్ని రద్దు చేయాలని స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావు వారికి మద్దతు తెలిపారు. భూముల వేలంలో పాల్గొనే వారికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Chandupatla Inscription | చందుపట్ల చరిత్రను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం