Rayapati Sambasiva Rao | మాజీ ఎంపీ సాంబశివరావు మృతి

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rayapati Sambasiva Rao | మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా ప్రోస్టేట్​ క్యాన్సర్​తో బాధ పడుతున్న ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ఉంగుటూరులో జన్మించిన ఆయన (Rayapati Sambasiva Rao ) ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. పొగాకు వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రాయపాటి మృతితో గుంటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్​ సంతాపం తెలిపారు. రాయపాటి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బాబు పేర్కొన్నారు. ఆరుసార్లు ఎంపీగా పనిచేసి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి రాయపాటి అని లోకేశ్​ అన్నారు.

Rayapati Sambasiva Rao | కాంగ్రెస్​ నుంచి రాజకీయాల్లోకి..

రాయపాటి కాంగ్రెస్​ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ.. గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీ దృష్టిలో పడి 1982 లో ఆంధ్రప్రదేశ్ నుండి మొదటిసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 39 ఏళ్ల వయస్సులోనే రాజ్యసభ ఎంపీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్​ నుంచి 1996,1998, 2004, 2009లో గుంటూరు ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014లో ఆయన కాంగ్రెస్​ను వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2014లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

దీనిని కూడా చదవండి : Ghatkopar Railway Station | రైల్వే స్టేషన్​లో ఘోరం.. వృద్ధురాలిపై అత్యాచారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *