CP Sai Chaitanya | ఎస్సై ప్రిలిమినరీ రాతపరీక్ష కేంద్రాల పరిశీలన

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanya |  నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ఆయా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

CP Sai Chaitanya | భద్రతా ఏర్పాట్లు..

ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్​శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు, అభ్యర్థుల ప్రవేశం, తనిఖీ ప్రక్రియ, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, తాగునీరు, ప్రవేశ మార్గాలు, అభ్యర్థుల రాకపోకలు, పరీక్షా కేంద్రాల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

CP Sai Chaitanya | ఆందోళనకు గురికాకుండా..

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు , ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

 దీనిని కూడా చదవండి : Delimitation Bill | మా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదు.. డీలిమిటేషన్​పై స్టాలిన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *