Assam Election Results | అస్సాంలో హ్యాట్రిక్​ దిశగా బీజేపీ.. 91 స్థానాల్లో అధిక్యం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assam Election Results | అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్​ కొట్టనుంది. మూడో సారి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. 91 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

అస్సాం (Assam)లో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ మ్యాజిక్​ ఫిగర్​ 64 కాగా.. బీజేపీ 91 అభ్యర్థులు 91 చోట్ల లీడ్​లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్​ 28 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 రెండు చోట్ల లీడ్​లో ఉన్నారు. మ్యాజిక్​ ఫిగర్​ను దాటి బీజేపీ (BJP) దూసుకు పోతుంది. దీంతో కమలం పార్టీ నేతలు సంబరాలకు సిద్ధం అవుతున్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ లీడ్​లో ఉన్నారు.

Assam Election Results | రెండోసారి సీఎం

అస్సాంలో హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) రెండోసారి సీఎం కానున్నారు. బీజేపీ ఇక్కడ 2016 నుంచి అధికారంలో ఉంది. ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్​ కొడుతోంది. 2016 నుంచి 2021 వరకు సర్బనంద సోనోవాల తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 2021లో హిమంత సీఎం అయ్యారు. ఫలితాల్లో ఆ పార్టీ దూసుకు పోతుండటంతో రెండో సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Assam Election Results | తమిళనాడులో..

తమిళనాడు (Tamil Nadu)లో టీవీకే పార్టీ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 103 స్థానాల్లో లీడ్​లో ఉంది. ఏఐడీఎంకే 76, డీఎంకే 55 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అధికార డీఎంకే కూటమి మూడో స్థానానికి పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది చెన్నైలో DMK ఆఫీసు ముందు టెంట్లు తొలగించారు. తమిళనాడులో 118 స్థానాల్లో గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు. విజయ్​ పార్టీ మ్యాజిక్​ ఫిగర్​కు సమీపంలో ఉంది.

ఇది కూడా చదవండి..: Bengal Election Results | బెంగాల్​లో బీజేపీ హవా.. టీఎంసీకి షాక్​ తప్పదా

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *