Kamareddy Municipal Commissioner | కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: Kamareddy Municipal Commissioner | జిల్లాలోని (Kamareddy District) కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు నూతన కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. కామారెడ్డి కమిషనర్ గా జీహెచ్ఎంసీలో శంషాబాద్ ఏఎంసీగా విధులు నిర్వహించిన టి.పర్వతాలును బదిలీ చేసింది. దీంతో ఆయన సోమవారం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Kamareddy Municipal Commissioner | ఎల్లారెడ్డి మున్సిపల్​ కమిషనర్​గా..

కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా పనిచేసిన రాజేందర్ రెడ్డి పనితీరుపై కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను మున్సిపల్ శాఖకు సరెండర్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దాంతో నొచ్చుకున్న ఆయన సెలవుపై వెళ్లగా ఆయనను మున్సిపల్ శాఖ (Municipal Department)కు సరెండర్ చేశారు. అలాగే నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చిన జగ్జీవన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇద్దరు కమిషనర్లు కలెక్టర్‌ ఆశిష్ సంగ్వాన్​ (Collector Ashish Sangwan)ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.

Kamareddy Municipal Commissioner

ఇది కూడా చదవండి..: Kamareddy DSP Madhusudan | కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *