TVK Government Formation | ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్​కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TVK Government Formation | తమినాళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly elections) టీవీకే పార్టీ అనూహ్య ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే ప్రజల మద్దతు పొందింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లుకు కొద్దిదూరం ఆగిపోయింది.

కాగా.. ఇతరుల మద్దతులో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్​ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు టీవీకే చీఫ్​ విజయ్​ (TVK Chief Vijay) లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

TVK Government Formation | రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటాం..

రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్​ను విజయ్​ కోరారు. ఇప్పటికే సీఎం పదవికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ (Tamil Nadu CM Stalin) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో గవర్నర్​ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

TVK Government Formation | మెజారిటీ 118 మంది సభ్యులు

తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లకు గాను మెజారిటీకి 118 అవసరం ఉంటుంది. అయితే టీవీకే 108 సీట్లను గెలుచుకుంది. దీంతో ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. వారిని ఆకర్షించేందుకు మంత్రి పదవులు, నిధుల హామీలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు గా తెలుస్తోంది. మరోవైపు.. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఎమ్మెల్యేలు విజయ్ వైపు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్​ రెండు వారాల గడువు కోరినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయం టీవీకేకు చాలా కీలకంగా మారనుంది.

ఇది కూడా చదవండి..: Tiruppattur Election Result | ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం.. విదేశాల‌ నుంచి వచ్చి ఓటేసిన వ్య‌క్తే ఈ గెలుపుకు కారణమా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *