జాతీయంWest Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

West Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం కాబోతోంది. ఈ నెల 9న రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశీస్సులతో కొత్త పాలనకు శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.

West Bengal Politics|ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు..

ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఎన్నికల సంఘం అధికారులు గెలిచిన అభ్యర్థుల వివరాలతో కూడిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను నేడు ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. బుధవారం ఈ పత్రాలను గవర్నర్ ఆర్.ఎన్. రవికి సమర్పిస్తారు. అనంతరం, నిబంధనల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కోరనున్నారు. కొత్త సీఎం బాధ్యతలు చేపట్టే వరకు ఆమె తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

West Bengal Politics|మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ..

బెంగాల్‌లో భాజపా గెలుపుతో మార్పులు అప్పుడే మొదలయ్యాయి. అసన్‌సోల్‌లో ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా మూతపడిన దుర్గాదేవి ఆలయం సోమవారం తిరిగి తెరుచుకుంది. తాను గెలిస్తే ఆలయాన్ని తెరిపిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన భాజపా ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ, విజయం సాధించిన వెంటనే తన మాట నిలబెట్టుకున్నారు. స్థానికులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: TVK Government Formation | ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్​కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి

అక్షరటుడే, మెండోరా: Biopesticides Usage | పంటలకు పురుగు మందులను అవసరమైన...

Stock Market Today | పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్.. నష్టాల్లో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు...

Konda Surekha Comments | పుష్కరాలకు ఏపీకి కోట్లు.. తెలంగాణకు సున్నా.. కేంద్రం వివక్షపై సురేఖ ఆగ్రహం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Konda Surekha Comments| ప్రధాని మోదీ పర్యటనలు, బీజేపీ రాజకీయాలపై...

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో...