నిజామాబాద్Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి

Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి

పంటలకు పురుగు మందులను అవసరమైన మోతాదు మేరకు వినియోగించాలని కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ సూచించారు.

అక్షరటుడే, మెండోరా: Biopesticides Usage | పంటలకు పురుగు మందులను అవసరమైన మోతాదు మేరకు వినియోగించాలని కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ సూచించారు. ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సమన్వయంతో మెండోరా (Mendora) రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు.

Biopesticides Usage | బయోపెస్టిసైడ్స్​ వినియోగించాలి

రైతులు (Farmers) పురుగు మందులను విచక్షణాయుతంగా మాత్రమే వినియోగించాలని కీటక శాస్త్రవేత్త సూచించారు. వేపనూనె, అజాడిరక్తిన్ వంటి బయోపెస్టిసైడ్స్‌ను ప్రారంభ దశలో ఉపయోగించాలన్నారు. పురుగుల తీవ్రత పెరిగిన తర్వాత మాత్రమే రసాయన మందులను వాడాలని తెలిపారు. లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల స్థాయిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Biopesticides Usage | డిమాండ్​ ఉన్న పంటలను సాగుచేయాలి

మండల వ్యవసాయ అధికారి ఎస్.వైష్ణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట రకాలను సాగు చేయాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కె.ముత్యం రెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడి, లాభాలు సాధించవచ్చని తెలిపారు.

Biopesticides Usage

కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి టి.సంధ్య రేఖ, గ్రామ సర్పంచ్ బి.ప్రమోద్, ఉప సర్పంచ్ ఎం.రాజేశ్వర్, కోడిచర్ల సర్పంచ్ వి.శ్రీనివాస్, ఎఫ్‌పీవో ఛైర్మన్ ఎన్.సాయి రెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​వో, ఆర్డీవోల నియామకం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bhu Bharati server down | భూ భారతి సర్వర్​ డౌన్​.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu Bharati server down | రాష్ట్రంలో...

Beedi Thekedars | డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలి.. బీడీ టేకేదార్ల డిమాండ్

అక్షరటుడే, కామారెడ్డి: Beedi Thekedars | చార్ బై కంపెనీ నుంచి...

Shabbir Ali | అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం..: షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో దుకాణాలు కోల్పోయిన...

Hyderabad Lantern Festival హైదరాబాద్‌లో ‘థాయ్’ మాయాజాలం..మే 9న భారీ లాంతర్ల పండుగ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hyderabad Lantern Festival థాయ్‌లాండ్ దేశపు ప్రసిద్ధ సంప్రదాయ వేడుకను...