Hyderabad Women Safety | అర్ధరాత్రి ఒంటరిగా మహిళ.. వస్తావా అని వేధించిన పోకిరీలు.. ఆమె ఎవరో తెలిసి షాక్​!

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Hyderabad Women Safety | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అర్ధరాత్రి పోకిరీలు హల్​చల్​ చేస్తారు. రోడ్లపై వేగంగా వాహనాలను నడుపుతూ హంగామా చేస్తారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే వేధింపులకు గురి చేస్తారు. మహిళల ఇబ్బందులను గుర్తించడానికి ఓ అధికారి ఒంటరిగా రోడ్డుపై నిలబడ్డారు.

హైదరాబాద్ వీధుల్లో అర్ధరాత్రి మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవడానికి ఒక ఐపీఎస్ అధికారిణి (IPS Officer) దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్​ (Dilsukhnagar Bus Stand) వద్ద ఒంటిరగా నిలబడ్డారు. ఆ తర్వాత ఆమెకు ఎదురైన అనుభవాలు మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. “వస్తావా?” అనడం నుంచి అసభ్యకరమైన ప్రతిపాదనలు, పదేపదే వేధింపుల వరకు అర్ధరాత్రి 12.30 నుండి 3.30 గంటల మధ్య దాదాపు 40 మంది పురుషులు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె ఎవరో కాదు మల్కాజిగిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi). తన దగ్గరకు వచ్చిన పోకిరీలను పట్టుకొని ఆమె కౌన్సెలింగ్ ఇచ్చారు.

Hyderabad Women Safety | మద్యం మత్తులో..

సీపీ దగ్గరకు వచ్చిన వారిలో చాలామంది మద్యం సేవించి ఉండగా, మరికొందరు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. కానీ వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, మహిళల పట్ల వారి ప్రవర్తన గురించి హెచ్చరించారు. కాగా ఇలాంటి ఆపరేషన్ ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 25 సంవత్సరాల క్రితం, కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో క్షేత్రస్థాయిలో మహిళల భద్రతను అర్థం చేసుకోవడానికి ఆమె ఇలాంటి ఆపరేషన్‌ నిర్వహించారు.

ఇది కూడా చదవండి..: Cyber Fraud Hyderabad| ఫేస్‌బుక్‌ యాడ్‌పై నొక్కి.. రూ.1.75 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *