Samsung Market Cap | ట్రిలియన్ డాలర్ల క్లబ్ లోకి శాంసంగ్.. రెండో ఆసియా కంపెనీగా రికార్డ్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Market Cap | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)లో ఉపయోగించే చిప్ లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్టాక్ పరుగులు తీస్తోంది. ఇన్వెస్టర్లకు గత సంవత్సరంలో నాలుగు రెట్లకు పైగా రాబడులను అందించింది.

తాజాగా బుధవారం సెషన్‌లో 15 శాతం పెరిగడంతో ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఆసియా కంపెనీలలో శాంసంగ్ (Samsung) రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది.

Samsung Market Cap | మెమరీ రంగంలో ఆధిపత్యం..

మెమరీ రంగంలోని తన పోటీదారులైన ఎస్కే హైనిక్స్ ఇంక్., టీఎసఎంసీలతో శాంసంగ్ పోటీ పడుతోంది. చిప్‌మేకింగ్ రంగంలో తన ఆధిపత్యాన్ని విస్తరిస్తున్న డేటా మౌలిక సదుపాయాలతో జతచేస్తూ, ఆసియాను ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్ కు మూలస్తంభంగా మార్చిన పరివర్తనకు కేంద్రబిందువుగా ఉంది. అధునాతన చిప్‌లు, కంప్యూటింగ్ సామర్థ్యానికి నిరంతర డిమాండ్ ఉంటుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తుండడంతో టెక్ స్టాక్స్ బలమైన ర్యాలీ తీస్తున్నాయి. ఈ నెలలో ఎస్కే హైనిక్స్ ఇంక్., టీఎసఎంసీ కూడా రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుకున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Rally | మార్కెట్‌పై బుల్స్ పైచేయి.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *