అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 07 Market Analysis | క్రూడ్ ఆయిల్(Crude oil) ధర దిగివస్తుండడం, టెక్ స్టాక్స్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడంతో వాల్ స్ట్రీట్ భారీ ర్యాలీ తీసింది. యరోపియన్ మార్కెట్లు దానిని అనుసరించాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో సాగుతున్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
May 07 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
టెక్ స్టాక్స్ లో ర్యాలీతో వాల్ స్ట్రీట్ మరోసారి రికార్డ్ స్థాయి గరిష్టాలకు చేరింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 2.02 శాతం, ఎస్ అండ్ పీ 1.46 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభంతో ఉంది.
May 07 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.86 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 2.10 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.07 శాతం లాభపడ్డాయి.
May 07 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 5.62 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.37 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.55 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.38 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.34 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.20 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 0.27 శాతం నష్టంతో సాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,834 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,836 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.08 నుంచి 1.19 కు పెరిగింది.
- విక్స్ 6.87 శాతం తగ్గి 16.68 వద్ద ఉంది. 15 కు తగ్గితే బుల్స్ కు అనుకూలం.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.66 డాలర్లకు తగ్గింది.
యూఎస్ డాలర్ ఇండెక్స్ 97.93 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.35 వద్ద ఉన్నాయి. - డాలర్‌తో రూపాయి మారకం విలువ 68 పైసలు బలపడి 94.61 వద్ద ఉంది.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Tamil Nadu Hung Assembly | అన్నా డీఎంకే – డీఎంకే చర్చలు..! ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రత్యర్థులు?


[…] […]