జాతీయంVijay Floor Test | విజయ్​ బల నిరూపణకు గవర్నర్​ గ్రీన్​ సిగ్నల్​

Vijay Floor Test | విజయ్​ బల నిరూపణకు గవర్నర్​ గ్రీన్​ సిగ్నల్​

త‌మిళ‌నాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గ‌వ‌ర్న‌ర్ గ్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చారు. పార్టీ అధినేత విజ‌య్ గవర్నర్​తో భేటీ అయ్యారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Floor Test | తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత తన వాదనను వినిపించిన ఒక రోజు తర్వాత, విజయ్, గవర్నర్ మధ్య ఇది రెండో సమావేశం.

విజయ్​ బల నిరూపణకు గవర్నర్​ ఆమోదం తెలిపారు. సభలో బలం నిరూపించుకోవడానికి ముందే మెజారిటీ ఉన్నట్లు లేఖ అందించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. అందులో విజయ్​ రెండు చోట్ల గెలుపొందడంతో ఒక్క స్థానం నుంచి వైదొలిగారు. దీంతో టీవీకే బలం 107కు తగ్గింది. విజయ్​కు ఇప్పటికే కాంగ్రెస్​ 5గురు ఎమ్మెల్యేలు, వీసీకే మద్దతు తెలిపారు. దీంతో పార్టీ బలం 115కు చేరింది. మరో ముగ్గురు మద్దతు తెలిపితే విజయ్​ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

Vijay Floor Test | జాబితా సమర్పించాలని..

విజయ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ను కలిసి, మద్దతు ప్రకటించిన టీవీకే, కాంగ్రెస్ శాసనసభ్యుల జాబితాను సమర్పించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అయితే, విజయ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడంపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదని లోక్‌భవన్ అధికారులు తెలిపారు. కాగా విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలను ఏఐఏడీఎంకే ఖండించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Tamil Nadu Re Elections | తమిళనాడులో మళ్లీ ఎన్నికలు పెట్టాలి.. జోహో మాజీ సీఈవో

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు...

Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement Transport | రాష్ట్రంలో ధాన్యం...

Kamareddy Co-option Election | కొనసాగిన కాంగ్రెస్​..బీఆర్​ఎస్​ బంధం.. ముగిసిన కామారెడ్డి కోఆప్షన్​ ఎన్నిక

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Co-option Election | కామారెడ్డి మున్సిపాలిటీలో (kamareddy...

Olympiad Education | బంగారు భవితకు పునాది.. విద్యార్థుల విజయానికి స్వర్ణ మార్గం.. ఒలంపియాడ్‌ విద్య 

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Olympiad Education | నేటి వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో...