అక్షరటుడే, వెబ్డెస్క్: Sharjah UAE Separation | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి Sharjah విడిపోవచ్చన్న వార్తలు గల్ఫ్ దేశాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లీక్ డాక్యుమెంట్ ప్రకారం.. ఈ మే నెలాఖరుకు ముందే “రిపబ్లిక్ ఆఫ్ షార్జా” అనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Sharjah UAE Separation | గల్ఫ్ రాజకీయాల్లో కీలక స్థానం
ఈ సమాచారమే గనుక నిజమైతే.. గల్ఫ్ ప్రాంత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు యూఏఈ ప్రభుత్వం కానీ, షార్జా అధికార వర్గాలు ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేయకపోవడం గమనార్హం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పత్రం ప్రామాణికతపై స్పష్టత లేదు. దీంతో ఈ విడిపోయే వార్తలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గల్ఫ్ రాజకీయాల్లో కీలక స్థానం కలిగిన షార్జా పై వస్తున్న ఈ ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని కలిగిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలను నిర్ధారించలేమని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Nida Khan Arrest | ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన TCS వంచకి నిదా ఖాన్

