Gold Rates Today | రికార్డు స్థాయికి బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ షాక్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Rates Today | ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిరత, యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు బంగారం ధరలపై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ల (Stock markets)లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా బంగారాన్ని అత్యంత భద్రమైన పెట్టుబడిగా భావిస్తూ భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,301కి చేరగా, 22 క్యారెట్ల గ్రాము ధర రూ.14,026గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.11,476గా ఉంది. గత కొన్ని రోజులుగా వరుస పెరుగుదల కొనసాగుతుండటంతో సామాన్యులు బంగారం కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు.

Gold Rates Today | పెరుగుతున్న ధ‌ర‌లు..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,160కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,40,410గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,010 ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,260గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు భారీగానే నమోదయ్యాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,010గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,260కి చేరుకుంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ఈ పెరుగుదల కొనుగోలుదారులపై అదనపు భారం మోపుతోంది.

ఇక వెండి ధర (Silver Prices)ల్లో  మాత్రం మిశ్రమ ధోరణి కనిపించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,70,100కు చేరుకుంది. అయితే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,74,900గా నమోదైంది.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నంత వరకు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ మారకం విలువ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..: AI Plus Nova Flip | సూపర్ ఫీచర్స్‌తో ఫ్లిప్ ఫోన్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *