Vijay Oath Ceremony | రేపే విజయ్​ ప్రమాణ స్వీకారం.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Oath Ceremony | తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. దళపతి విజయ్​ శనివారం ముఖ్యమంత్రిగా (CM Vijay) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్​ అనుమతించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tanil Nadu Elections) ఫలితాలు వెలువడినా.. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. విజయ్​ టీవీకే (TVK) 108 స్థానాల్లో గెలుపొందడంతో ఇతర పార్టీల మద్దతుతో ఆయన సీఎం కానున్నారు. అయితే మద్దతుపై పార్టీలు మూడు రోజులుగా తేల్చకపోవడంతో సస్పెన్స్​ నెలకొంది. ఎట్టకేలకు విజయ్​కు కాంగ్రెస్​తో పాటు సీపీఐ, సీపీఎం, డీసీకే మద్దతు తెలిపాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్​ను గవర్నర్​ను ఆహ్వానించారు.

Vijay Oath Ceremony | 120 మంది ఎమ్మెల్యేల మద్దతు

టీవీకే అధినేత విజయ్​ శుక్రవారం సాయంత్రం గవర్నర్​ అర్లేకర్​తో భేటీ అయ్యారు. తనకు 120మంది MLAల మద్దతు ఉందని జాబితా అందించారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి తెలిపారు. దీంతో తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కొలువుదీరనుంది. రేపు ఉదయం 11 గంటలకు విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. సోమవారం లేదా మంగళవారం మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని సమాచారం.

దీనిని కూడా చదవండి : Suvendu Adhikari CM| బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణ స్వీకారం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *