Instagram Followers Drop | ఇన్​స్టాగ్రామ్​లో సంచలనం.. ఒకేరోజు కోట్లలో ఫాలోవర్లు మాయం..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Instagram Followers Drop | ప్రముఖ సోషల్​మీడియా (Social Media) యాప్ ఇన్​స్టాగ్రామ్​​లో సంచలనం జరిగింది. ఒకే రోజు కోట్లలో ఫాలోవర్లు మాయం అయ్యారు. దీంతో చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో నుంచి మిలియన్ల ఫాలోవర్లు తగ్గిపోయారు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఇన్​స్టాగ్రామ్​ (Instagram) అఫిషయల్​ అకౌంట్​ నుంచి కూడా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు అదృశ్యం కావడం కొసమెరుపు.

Instagram Followers Drop | కారణం అదేనా..

ఇన్‌స్టాగ్రామ్ క్లీన్​ అప్​ డ్రైవ్​ పేరుతో ఫేక్, ఇనాక్టివ్, బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మే నెలలో భారీ స్థాయిలో ఇలాంటి అకౌంట్లను తొలగించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, ఇన్​ఫ్లుయెన్సర్ల ఫాలోవర్స్ సంఖ్య ఒక్కరోజులోనే భారీగా పడిపోయింది. చాలా మంది ప్రముఖుల ఖాతాలలో మిలియన్ల మంది ఫాలోవర్లు తగ్గిపోయారు.

 Instagram Followers Drop | ఫాలోవర్లు తగ్గిపోయిన ప్రముఖులు వీరే..

ఇన్​స్టాగ్రామ్​ తీసుకున్న చర్యతో సెలబ్రిటీలతో పాటు ఇన్​ఫ్లుయెన్సర్లు, బిజినెస్​ అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇందులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) 6.6 మిలియన్ల నుంచి 18 మిలియన్ల (1.8 కోట్లు) వరకు ఫాలోవర్లను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత అమెరికాకు చెందిన సోషలైట్ మరియు వ్యాపారవేత్త కైలీ క్రిస్టెన్ జెన్నర్ దాదాపు 15 మిలియన్ల (1.5 కోట్లు) ఫాలోవర్లను కోల్పోయింది. లియోనెల్ మెస్సీ 4 మిలియన్ల నుండి 8 మిలియన్ల వరకు ఫాలోవర్లను కోల్పోయాడు. ఇక అరియానా గ్రాండే, టేలర్ స్విఫ్టలకు కూడా 5 ‌‌– 7 మధ్య ఫాలోవర్లను తగ్గిపోయారు.

 Instagram Followers Drop | భారత సెలబ్రిటీల విషయానికి వస్తే..

ఇక భారత్​లో అత్యధికంగా విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, మరియు ఆలియా భట్​లకు ఇన్​స్టాగ్రామ్​లో ఫాలోవర్లు ఉన్నారు. ఇక్కడి ప్రముఖులకు కూడా గణనీయంగా ఫాలోవర్లు తగ్గిపోయారు.

ఇది కూడా చదవండి..: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *