అక్షరటుడే, వెబ్‌డెస్క్: Instagram Followers Drop | ప్రముఖ సోషల్‌మీడియా (Social Media) యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం జరిగింది. ఒకే రోజు కోట్లలో ఫాలోవర్లు మాయం అయ్యారు. దీంతో చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో నుంచి మిలియన్ల ఫాలోవర్లు తగ్గిపోయారు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అఫిషయల్ అకౌంట్ నుంచి కూడా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు అదృశ్యం కావడం కొసమెరుపు.
Instagram Followers Drop | కారణం అదేనా..
ఇన్‌స్టాగ్రామ్ క్లీన్ అప్ డ్రైవ్ పేరుతో ఫేక్, ఇనాక్టివ్, బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మే నెలలో భారీ స్థాయిలో ఇలాంటి అకౌంట్లను తొలగించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ఫాలోవర్స్ సంఖ్య ఒక్కరోజులోనే భారీగా పడిపోయింది. చాలా మంది ప్రముఖుల ఖాతాలలో మిలియన్ల మంది ఫాలోవర్లు తగ్గిపోయారు.
Instagram Followers Drop | ఫాలోవర్లు తగ్గిపోయిన ప్రముఖులు వీరే..
ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న చర్యతో సెలబ్రిటీలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లు, బిజినెస్ అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇందులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) 6.6 మిలియన్ల నుంచి 18 మిలియన్ల (1.8 కోట్లు) వరకు ఫాలోవర్లను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత అమెరికాకు చెందిన సోషలైట్ మరియు వ్యాపారవేత్త కైలీ క్రిస్టెన్ జెన్నర్ దాదాపు 15 మిలియన్ల (1.5 కోట్లు) ఫాలోవర్లను కోల్పోయింది. లియోనెల్ మెస్సీ 4 మిలియన్ల నుండి 8 మిలియన్ల వరకు ఫాలోవర్లను కోల్పోయాడు. ఇక అరియానా గ్రాండే, టేలర్ స్విఫ్టలకు కూడా 5 – 7 మధ్య ఫాలోవర్లను తగ్గిపోయారు.
Instagram Followers Drop | భారత సెలబ్రిటీల విషయానికి వస్తే..
ఇక భారత్‌లో అత్యధికంగా విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, మరియు ఆలియా భట్‌లకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఉన్నారు. ఇక్కడి ప్రముఖులకు కూడా గణనీయంగా ఫాలోవర్లు తగ్గిపోయారు.
ఇది కూడా చదవండి..: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

