జాతీయంTamilNadu Politics | సస్పెన్షన్​ థ్రిలర్​లా ట్విస్టులు.. ఎట్టకేలకు విజయ్‌కి గవర్నర్ అపాయింట్‌మెంట్‌

TamilNadu Politics | సస్పెన్షన్​ థ్రిలర్​లా ట్విస్టులు.. ఎట్టకేలకు విజయ్‌కి గవర్నర్ అపాయింట్‌మెంట్‌

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్​ క్లియర్​ అయిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు విజయ్​కి గవర్నర్​ అపాయింట్​మెంట్​ సైతం లభించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TamilNadu Politics | తమిళ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్​ను మించిన ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన వచ్చిందని గవర్నర్ కార్యాలయానికి టీవీకే చీఫ్ వెళ్లారు. కానీ ఆయన అపాయింట్‌మెంట్ లభించలేదు.

TamilNadu Politics | తిరిగి వెళ్లిపోయిన విజయ్​

గవర్నర్​ అపాయింట్​మెంట్​ లభించకపోవడంతో లోక్‌భవన్ నుంచి విజయ్ టీవీకే కార్యాయాలయానికి తిరిగి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే గవర్నర్​ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో విజయ్‌ తిరిగి లోక్‌భవన్‌కు వెళ్లారు.

TamilNadu Politics | వివిధ పార్టీల మద్దతు

టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. కాగా.. వివిధ పరిణామాల అనంతరం.. వీసీకే, ఐయూఎంల్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాయి. ఎట్టకేలకు మెజారిటీకి సరిపడా ఎమ్మెల్యే మద్దతు లభించడంతో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసేందుకు విజయ్​ లోక్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే గవర్నర్ షెడ్యూల్ కారణంగా మొదట అపాయింట్‌మెంట్ లభించలేదు. అయితే కాసేపటికే గవర్నర్​ తన కేరళం పర్యటనను రద్దు చేసుకుని విజయ్​కి అపాయింట్​మెంట్​ ఇచ్చారు. దీంతో టీవీకే చీఫ్ మళ్లీ గవర్నర్​ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు.

ఇది కూడా చదవండి..: Vijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Theft Attempt Kamareddy | మద్యం మత్తులో చోరీకి యత్నం.. దొంగలకు దేహశుద్ధి

అక్షరటుడే, కామారెడ్డి: Theft Attempt Kamareddy | కామారెడ్డి పట్టణంలో(Kamareddy City)...

Gutka Dump Seized | చీతా ఫోర్స్​ మెరుపు దాడులు.. భారీగా గుట్కా డంప్​ స్వాధీనం

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Gutka Dump Seized | నిజామాబాద్​ పోలీస్​...

Youth Congress Presidents | యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Presidents | కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని...

India MIRV Missile|ఒకే క్షిపణి.. ఎన్నో లక్ష్యాలు.. రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India MIRV Missile|భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. అణ్వస్త్ర...