బిజినెస్​Royal Enfield Brand | ‘బుల్లెట్’ స్పీడ్​తో పైపైకి.. ప్రపంచంలోనే 3వ స్ట్రాంగెస్ట్ ఆటో బ్రాండ్​గా...

Royal Enfield Brand | ‘బుల్లెట్’ స్పీడ్​తో పైపైకి.. ప్రపంచంలోనే 3వ స్ట్రాంగెస్ట్ ఆటో బ్రాండ్​గా గుర్తింపు..

ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. ప్రపంచంలోనే 3వ అత్యంత దృఢమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా అవతరించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Royal Enfield Brand | ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. ప్రపంచంలోనే 3వ అత్యంత దృఢమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా (strongest auto brand) అవతరించింది. తాజాగా విడుదలైన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026’(Brand Finance Automotive Industry) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఆడి, ఫెరారీ వంటి గ్లోబల్ దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టడం గమనార్హం. కాగా మొదటి స్థానంలో టయోటా(Toyota), రెండో స్థానంలో బీఎండబ్ల్యూ(BMW) ఉన్నాయి. ఆడి నాలుగో స్థానంలో ఉండగా ఫెరారీ ఏడో స్థానానికి పరిమితమయ్యింది. కాగా ఈ జాబితాలో మరికొన్ని భారతీయ కంపెనీలు సైతం చోటు దక్కించుకున్నాయి. టాటా మోటార్స్(Tata Motors) 5, మహీంద్రా 25, మారుతి సుజుకీ 34 స్థానాల్లో నిలిచాయి.

Royal Enfield Brand | బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ (బీఎస్ఐ)..

రాయల్ ఎన్‌ఫీల్డ్ 100కు గానూ 88.9 స్కోరు సాధించి, ప్రతిష్టాత్మకమైన ‘ఏఏ’ రేటింగ్‌ను దక్కించుకుంది. ఒకప్పుడు రెట్రో మోటార్ సైకిల్ (పాతకాలపు లుక్) తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం బ్రాండ్ వాల్యూతో (Bullet bike) అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. సింపుల్ ఇంజినీరింగ్, క్లాసిక్ డిజైన్ కోరుకునే రైడర్లను హంటర్ 350, సూపర్ మెటోర్ 650 వంటి మోడల్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అడ్వెంచర్ విభాగంలోకి అప్‌డేటెడ్ హిమాలయన్ తో అడుగుపెట్టడం వల్ల మరింత ఎక్కువ మంది కస్టమర్లకు చేరువయ్యే అవకాశం లభించింది.

Royal Enfield Brand | 80 కి పైగా దేశాల్లో కార్యకలాపాలు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోంది. ప్రస్తుతం 80కి పైగా దేశాల్లో 3,200 రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. విదేశీ మార్కెట్లలో పట్టు సాధించేందుకు వీలుగా ఏడు అంతర్జాతీయ సీకేడీ అసెంబ్లీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రధానంగా యూరోప్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో ఈ కంపెనీ బైక్‌లకు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్ విలువ 1.2 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.11 వేల కోట్లు) దాటింది. మార్కెట్ క్యాప్ ఏడాదిలో 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ తన మూలాలను వదలకుండా ఆధునిక సాంకేతికతను జోడించి బైక్‌లను అందిస్తుండడమే ఈ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Farmers Protest Movement | దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేస్తాం..: ఏఐయూకేఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దేశవ్యాప్త రైతాంగ పోరాటాలను ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నామని...

Bhagirath Sai POCSO Case |భగీరథ్ సాయిని అరెస్ట్ చేయాల్సిందే.. పీఎస్ ముట్టడించిన మహిళలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhagirath Sai POCSO case | కేంద్ర మంత్రి...

Modi Congress Criticism | కాంగ్రెస్ ఒక ‘పరాన్నజీవి రాజకీయ శక్తి’.. బెంగళూరు సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Congress Criticism | కర్ణాటక పర్యటనలో ఉన్న...

Tata Nexon Sunroof | బడ్జెట్ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్.. దేశంలోనే తొలిసారి పరిచయం చేస్తున్న టాటా మోటార్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tata Nexon Sunroof |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ...