జాతీయంModi on Gold Purchase | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ కీలక...

Modi on Gold Purchase | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi on Gold Purchase | ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలను కోరారు. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం వచ్చిందని మోదీ అన్నారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదని తెలిపారు. అయితే ప్రజలు పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో సేవలను వాడుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని పిలుపునిచ్చారు.

Modi on Gold Purchase | ఫంక్షన్లు ఉన్నా..

ఏడాది పాటు ఏ ఫంక్షన్లు ఉన్నా.. ప్రజలు బంగారం కొనొద్దని మోదీ కోరారు. ఈ మేరకు ప్రజలు శపథం చేయాలన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని (Foreign exchange) కాపాడుకోవాలని సూచించారు. ఎరువులు, రసాయనాల వినియోగాన్ని సైతం తగ్గించాలన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు సూచించారు. ప్రజలు వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలన్నారు. మధ్య తరగతి ప్రజలు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఆడంబరాలకు పోవొద్దని హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పడు తీవ్ర చర్చకు దారి తీశాయి.

Modi on Gold Purchase | వర్క్​ ఫ్రం హోమ్​ చేయాలి

వ్యవసాయంలో డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలని రైతులను కోరారు. కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్నారు. కరోనా సమయంలో వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేయాలని సూచించినట్లు మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే పద్ధతిని ప్రారంభించాలన్నారు. ఆన్‌లైన్‌ మీటింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇటీవల ముడి చమురు రేట్లు భారీగా పెరిగాయి. దీంతో విదేశీ మారకద్రవ్యాన్ని ఇంధనం కోసం ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని వ్యాఖ్యలు చేశారు.

దీనిని కూడా చదవండి : Modi Targets Congress | ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bharat Karth Accident | తెలుగు సినీ పరిశ్రమలో...

Work From Home | దేశ ప్రయోజనాల కోసం మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి రావాలి : ప్రధాని Modi పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Work From Home | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు,...

Bandi Sanjay Allegations | ‘బాధితులను బండి సంజయ్ బెదిరించారు’.. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ సంచలన ఆరోపణలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Sanjay Allegations | 'నీ బిడ్డ ఎంత మందితో...

BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BRS Party Meeting | భారతీయ రాష్ట్ర సమితి...