Reduce Cooking Oil | వంట నూనె వినియోగాన్ని తగ్గించండి.. దేశ సేవ చేయండి: ప్రధాని మోడీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Reduce Cooking Oil | ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు వినూత్నమైన ఆహ్వానం ఇచ్చారు. ఇంట్లో వంట నూనె వినియోగాన్ని ప్రతి నెల 10 శాతం తగ్గించాలని మోడీ సూచించారు.

Reduce Cooking Oil | దేహ సేవతోపాటు దేశ సేవ

“వంట వినియోగం తగ్గించండి.. తద్వారా దేహ సేవతోపాటు దేశ సేవ కూడా చేసినవారు అవుతారు..” అని మోడీ అన్నారు. అంటే, తక్కువ నూనె వినియోగించడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం మెరుగవుతుంది.

దీనికితోడు దేశ వనరుల పరిరక్షణకు సహకారం అందించినవారు అవుతారని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడానికి, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ మాట చెబుతున్నట్లు తెలిపారు.

ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వనరులను తక్కువ వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని అన్నారు.

Bhayandar Vasai Bridge | డబుల్ డెక్కర్ వంతెన నిర్మాణానికి ముందడుగు.. 39 నుంచి 5 కి.మీ.లకు తగ్గనున్న దూరం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *