క్రీడలుTim David Controversy | భువీ సిక్సర్ తర్వాత టిమ్ డేవిడ్ వివాదాస్పద సెలబ్రేషన్.. బ్యాన్...

Tim David Controversy | భువీ సిక్సర్ తర్వాత టిమ్ డేవిడ్ వివాదాస్పద సెలబ్రేషన్.. బ్యాన్ విధిస్తారా..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ చివరి బంతికి విజయం సాధించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tim David Controversy | రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-ముంబై ఇండియ‌న్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులకు చివరి బంతి వరకు ఉత్కంఠను పంచింది.

లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ పోరులో ఆర్‌సీబీ చివరి క్షణంలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను బలంగా నిలబెట్టుకోగా, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో మరో అంశం వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన సెలబ్రేషన్ పెద్ద వివాదానికి దారితీసింది.

Tim David Controversy | చ‌ర్య‌లు త‌ప్ప‌వా?

చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికే రొమారియో షెపర్డ్ అవుట్ కావడంతో మ్యాచ్ ముంబై వైపు వెళ్లినట్టే కనిపించింది. ఈ సమయంలో ముంబై డగౌట్‌లో సంబరాలు కూడా మొదలయ్యాయి. కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ (Bhuvneshwar Kumar) రాజ్ బావా వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ సిక్సర్‌తో ఆర్‌సీబీ డగౌట్‌లో ఉత్సాహం పెరిగిపోయింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ తన కుర్చీ నుంచి లేచి రెండు మిడిల్ ఫింగర్స్ చూపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన ఆ సంకేతాన్ని ఎవరికి చూపించాడు? ముంబై ఆటగాళ్లకా? అంపైర్లకా? లేక మరెవరినైనా ఉద్దేశించిందా? అనే విషయంపై స్పష్టత లేదు.

Tim David Controversy | టిమ్ డేవిడ్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం

అయితే నెటిజన్లు మాత్రం టిమ్ డేవిడ్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఇలాంటి ప్రవర్తన సరైంది కాదని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి ప్రకారం టిమ్ డేవిడ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. కొందరు సోషల్ మీడియా వేదికగా ఆయనపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడొచ్చని చర్చిస్తున్నారు. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో టిమ్ డేవిడ్‌పై నిజంగానే చర్యలు తీసుకుంటే అది ఆర్‌సీబీకి భారీ దెబ్బ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఐపీఎల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇది కూడా చదవండి..: RCB Thriller Victory | చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబైకి షాక్ ఇచ్చిన ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ నుండి ఆ రెండు జ‌ట్లు ఔట్

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Co-option Election | ముగిసిన నిజామాబాద్​ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Co-option Election | నిజామాబాద్​ మున్సిపల్​...

Gold Traders Tension | బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. రేపు పీఎంవో అధికారులతో భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Traders Tension | రాబోయే ఏడాది...

Bandi Sanjay Son | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సీఎం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Son | కేంద్ర మంత్రి...

Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Illegal Gravel Excavation | మొరం అక్రమ...