Trisha Krishnan | త్రిష.. ఈ గ్లామర్ క్వీన్ వివాదాలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారింది..?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trisha Krishnan | దక్షిణ భారత సినీ రంగంలో దాదాపు రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయం, స్టార్‌డమ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌లలో Trisha Krishnan పేరు ముందువరుసలో ఉంటుందని చెప్పొచ్చు.

ఒకప్పుడు “గ్లామర్ క్వీన్”, “డ్రీమ్ గర్ల్”, “సౌత్ ఇండియన్ సినీ క్వీన్”గా అభిమానుల మనసులు గెలుచుకున్న త్రిష… వ్యక్తిగత జీవితం, రాజకీయ గాసిప్స్, సోషల్ మీడియా వివాదాలతో తాజాగా వార్తల్లో నిలుస్తోంది.

చెన్నైలో జన్మించిన Trisha Krishnan, మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. 1999లో మిస్ చెన్నై టైటిల్ గెలుచుకోవడం త్రిష జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

Trisha Krishnan

తొలి దశలో ప్రకటనల్లో కనిపించిన Trisha Krishnan, తర్వాత చిత్రాల్లో చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తమిళ చిత్రం Mounam Pesiyadhe ఆమెను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఆ చిత్రం విజయంతో త్రిష మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తన అందం, నటనతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన త్రిష.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. Mahesh Babu, Prabhas, Pawan Kalyan, Vijay, Ajith Kumar వంటి అగ్ర హీరోలతో నటిస్తూ ఆమె సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కాగా, త్రిష కెరీర్ ఎంత వైభవంగా కొనసాగిందో… ఆమె వ్యక్తిగత జీవితం కూడా అదే స్థాయిలో చర్చలు, పుకార్లు, వివాదాలతో నిండిపోయింది.

Trisha Krishnan

Trisha Krishnan | ప్రేమలు, డేటింగ్ పుకార్లు…

త్రిష పేరు ప్రధానంగా సినీ పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోలతో అనుసంధానమైంది. ముఖ్యంగా Rana Daggubatiతో ఆమె సన్నిహిత బంధం ఒకప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇద్దరూ కలిసి పార్టీల్లో కనిపించడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు వైరల్ కావడం, పలు ఈవెంట్లలో అత్యంత క్లోజ్‌గా కనిపించడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమ బందం ఉందనే ప్రచారం జరిగింది. అయితే కొంతకాలానికే ఆ బంధం ముగిసిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపై ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడకపోయినా, ఆ బ్రేకప్ సినీ వర్గాల్లో పెద్ద చర్చనే లేవనెత్తింది.

అంతేకాదు, త్రిష పేరు Dhanush, Silambarasan వంటి నటులతోనూ అనేకసార్లు వినిపించింది. ముఖ్యంగా Vinnaithaandi Varuvaayaa సినిమా సమయంలో శింబు-త్రిష స్నేహం గురించి వచ్చిన వార్తలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి.

అయితే, ఈ గాసిప్స్‌పై త్రిష ఎప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు. “నాకంటూ నా వ్యక్తిగత జీవితం ఉంది..” అనే ధోరణితోనే ముందుకు సాగింది.

Trisha Krishnan

Trisha Krishnan | నిశ్చితార్థం వరకు వెళ్లిన ప్రేమ..

త్రిష జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం వ్యాపారవేత్త Varun Manianతో జరిగిన నిశ్చితార్థం. 2015లో వీరి ఎంగేజ్‌మెంట్​ను ఘనంగా నిర్వహించారు. సినీ, వ్యాపార రంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకతో త్రిష త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు వెలువడ్డాయి.

అభిమానులు ఎంతో ఆనందించారు. కానీ, అనూహ్యంగా ఆ పెళ్లి ఆగింది. దీనికి కారణాలపై అప్పట్లో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత త్రిష సినిమాల్లో నటించడం వరుణ్ ఫ్యామిలీకి ఇష్టం లేదని, అదే విభేదాలకు కారణమని కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి.

మరికొందరు మాత్రం “త్రిష తన కెరీర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే ఈ బంధం ముగిసింది” అని చెప్పుకొచ్చారు. ఈ పెళ్లి బ్రేకప్ తర్వాత త్రిష మళ్లీ పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించింది.

Trisha Krishnan

Trisha Krishnan | Vijay – త్రిష బంధం.. స్నేహమా? లేక మరేదైనా?

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో విజయ్-త్రిష జోడీ ఒకటిగా చెప్పొచ్చు. Ghilli, Thirupaachi, Kuruvi వంటి చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన Leoలోనూ వీరి జోడీ మరోసారి అభిమానులను అలరించింది.

అయితే, కాలక్రమేణా ఈ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ.. ఆఫ్‌స్క్రీన్ రిలేషన్‌పై పుకార్లకు దారితీసింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రచారం మరింతగా వ్యాపించింది.

సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, విదేశీ ట్రిప్స్‌, ఈవెంట్ హాజరుకు సంబంధించిన కథనాలు వైరల్ కావడంతో “విజయ్-త్రిష బంధం”పై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరిలోనూ ఎవరు కూడా స్పష్టంగా స్పందించలేదు.

Trisha Krishnan | Sangeetha Sornalingam – విడాకుల ప్రచారం

విజయ్ – భార్య Sangeetha Sornalingamకు మధ్య దూరం పెరిగిందనే వార్తలు గత కొంతకాలంగా తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో పరిస్థితి మరింత వేడెక్కింది. ఎన్నికలకు ముందు సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని, భారీ మొత్తంలో అలిమోనీ కోరిందనే పోస్టులు వైరల్ అయ్యాయి. కానీ, ఈ వార్తలకు అధికారిక ధృవీకరణ ఎప్పుడూ రాలేదు.

Trisha Krishnan | టార్గెట్‌గా మారిన త్రిష

ఈ మొత్తం వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి త్రిష అని చెప్పొచ్చు. సోషల్​ మీడియాలో కొంతమంది నెటిజన్లు, విజయ్ అభిమానుల్లోని ఒక వర్గం ఆమెను నేరుగా టార్గెట్ చేస్తూ విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. “విజయ్ కుటుంబ జీవితంలో సమస్యలకు త్రిషే కారణం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరికొందరు ఆమెను “సైడ్ చిక్” అంటూ ట్రోల్ చేయడం వివాదానికి దారితీసింది. కాగా, త్రిష అభిమానులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని దూషించడం సరైంది కాదని వాదిస్తున్నారు. హితవు పలుకుతున్నారు.

Trisha Krishnan

గ్లామర్ స్టార్ నుంచి వివాదాల కేంద్రంగా…

దక్షిణ భారత్​లో త్రిష ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్‌లలో ఒకరు. రెండు దశాబ్దాల తర్వాత కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ తన స్థానాన్ని పదిలపర్చుకోవడం చిన్న విషయం కాదు.

కానీ, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ కథలు, రాజకీయ గాసిప్స్, సోషల్ మీడియా ట్రోలింగ్ వంటి అంశాలు ఆమెను తరచూ వివాదాల మధ్య నిలబెడుతున్నాయి.అయితే, నిజం ఏంటో తెలిసింది మాత్రం సంబంధిత వ్యక్తులకే. వారికి అత్యంత సన్నిహితులకే. సోషల్ మీడియాలో వినిపించే ప్రతి ప్రచారం కూడా వాస్తవం కావాల్సిన అవసరం లేదు. కానీ, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడు కూడా ప్రజా చర్చగా నానుతుందనే, పుకార్లకు కేంద్ర బిందువుగా మారుతుందనే విషయాన్ని త్రిష జీవితం మరోసారి స్పష్టం చేస్తోంది.

ఏది ఏమైనా… ఒక నటిగా త్రిష సాధించిన స్థానం ప్రత్యేకమనే చెప్పొచు.. కానీ, ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో “విజయ్ – సంగీత – త్రిష” చర్చ ఇంకా ముగియలేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Sreeleela Dating Rumors | శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ రూమర్లపై క్లారిటీ.. అస‌లు విష‌యం ఇది అంటూ స్వర్ణలత స్పందన

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *