Tamil Nadu CM Vijay | తమిళనాడు సీఎం విజయ్​ సంచలన నిర్ణయం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamilnadu Chief Minister) జోసెఫ్​ విజయ్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్మాక్ (TASMAC) మద్యం దుకాణాలను రాబోయే రెండు వారాల్లోగా మూసివేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టేషన్ల సమీపంలో పనిచేస్తున్న దుకాణాలను గుర్తించేందుకు టాస్మాక్ అవుట్‌లెట్ల (Tasmac Outlets)పై సర్వే నిర్వహించాలని విజయ్ ఆదేశించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా 4,765 రిటైల్ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, నిర్దేశిత ప్రాంతాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను గుర్తించేందుకు అధికారులు సర్వే చేశారు.

Tamil Nadu CM Vijay | రెండు వారాల సమయం

ఈ సర్వేలో 717 మద్యం దుకాణాలు నిషేధిత జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రార్థనా స్థలాల సమీపంలో 276, విద్యాసంస్థల సమీపంలో 186, బస్ స్టాండ్‌ల సమీపంలో 255 దుకాణాలు ఉన్నాయి. రెండు వారాల్లోగా మొత్తం 717 అవుట్‌లెట్లను మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని విజయ్​ ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ సంతకం చేశారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: AIADMK Split | బిగ్ బ్రేకింగ్‌: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌కు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *