India Toy Industry | ప్రపంచానికి ‘బొమ్మ’ చూపిస్తున్న భారత్.. ఆత్మనిర్భరత దిశగా ముందడుగు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Toy Industry | భారత్ బొమ్మల తయారీ పరిశ్రమలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఆత్మనిర్భరతతో ముందుకుసాగుతూ దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా.. ఎగుమతులనూ పెంచుకుంటోంది.

2020 సంవత్సరానికి ముందు భారత్ (India) సుమారు 300 మిలియన్ డాలర్లకుపైనే విలువైన బొమ్మలను దిగుమతి చేసుకునేది. ప్రధానంగా చైనానుంచి 235 మిలియన్ డాలర్ల వరకు దిగుమతి అయ్యేవి. 2025 నాటికి దిగుమతుల విలువ 70 మిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. చైనానుంచి ఇంపోర్ట్స్ 41 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో భారత్ నుంచి ఎగుమతులు 130 మిలియన్ డాలర్లనుంచి 172 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు అంచనా.

India Toy Industry | ప్రధాన కారణాలు..

కేంద్ర ప్రభుత్వం (Central Government) బొమ్మలపై ఇంపోర్ట్ డ్యూటీలు పెంచింది. దీంతో విదేశాలనుంచి దిగుమతి అయ్యే టాయ్స్ ఖరీదైనవిగా మారిపోయాయి. మరోవైపు క్వాలిటీ కంట్రోల్ (బీఐఎస్) నిబంధనలు కఠినతరం చేయడంతో తక్కువ నాణ్యత గల చీప్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మేక్ ఇన్ ఇండియా (Make in India)కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దీంతో స్థానిక తయారీదారులకు ప్రోత్సాహం లభించింది. ఎంఎస్​ఎంఈలకు అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశంలో 4 వేలకుపైగా టాయ్స్ తయారీ యూనిట్లు ఏర్పాటయినట్లు అంచనా.

ఇండియన్ థీమ్ బొమ్మలు (రామాయణ, మహాభారత, స్టెమ్ బొమ్మలు), ఎడ్యుకేషనల్, స్కిల్ బేస్డ్ బొమ్మలు, ఎలక్ట్రానిక్, ఔట్ డోర్ బొమ్మలు అభివృద్ధి చెందాయి. దీంతో మన దేశంలో తయారైన బొమ్మలకు ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం 150కిపైగా దేశాలకు మన బొమ్మలు ఎగుమతి అవుతుండడం గమనార్హం. గ్లోబల్ సప్లై చెయిన్ లో మార్పులు సైతం మన బొమ్మలకు డిమాండ్ పెరగడానికి కారణమయ్యాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: TVK MLA Shock | ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు కోర్టు షాక్‌

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *