అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price Hike | బంగారం ధరలు (Gold Prices) భారీగా పెరిగాయి. ఒక్క రోజే తులానికి రూ.13 వేలకు పైగా పెరగడం గమనార్హం. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
ఏడాది పాటు బంగారం కొనొద్దని ఇటీవల ప్రధాని మోదీ (Prime Minister Modi) సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సైతం పసిడిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. దీంతో గోల్డ్ రేట్లకు రెక్కలు వచ్చాయి. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) 6 నుంచి 15 శాతానికి పెంచుతూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఉన్నాయి. ఒక్కసారిగా దిగుమతి సుంకం పెరగడంతో పసిడి రేట్లు భారీగా పెరిగాయి.
Gold Price Hike | రూ.1.67 లక్షలకు..
కొంతకాలంగా బంగారం ధరలు 1.50 లక్షల నుంచి రూ.1.60 లక్షల మధ్య కదలాడుతున్నాయి. చాలా రోజులుగా ఇక్కడే రేట్లు స్థిరంగా ఉన్నాయి. తాజా కేంద్ర నిర్ణయంతో బుధవారం ఒక్కరోజే పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ఏకంగా రూ.13,910 పెరిగింది. దీంతో రూ.1.67 లక్షలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,750 పెరిగి రూ.1.53 లక్షలు పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు సైతం కిలోకు రూ.20 వేల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: May 13 Gold Prices | మళ్లీ పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు

