బిజినెస్​Uber CEO Delhi Metro| సామాన్యుడిలా ఢిల్లీ మెట్రోలో ఉబర్ సీఈఓ ప్రయాణం

Uber CEO Delhi Metro| సామాన్యుడిలా ఢిల్లీ మెట్రోలో ఉబర్ సీఈఓ ప్రయాణం

ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ 'ఉబర్' (Uber) అధిపతి దారా ఖోస్రోషాహి, దేశ రాజధాని ఢిల్లీలోని ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవడానికి మెట్రో రైలును ఆశ్రయించారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Uber CEO Delhi Metro| ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ‘ఉబర్’ (Uber) అధిపతి దారా ఖోస్రోషాహి, దేశ రాజధాని ఢిల్లీలోని ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవడానికి మెట్రో రైలును ఆశ్రయించారు. తన భారత పర్యటనలో భాగంగా ఆయన జోర్ బాగ్ స్టేషన్ నుండి మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Uber CEO Delhi Metro|సామాన్యుడిలా ప్రయాణం..

ఖోస్రోషాహి ‘మోదీ జాకెట్’ ధరించి, ఒక సాధారణ ప్రయాణికుడిలా స్టేషన్‌లో నడుస్తూ, కోచ్‌లో ప్రయాణిస్తూ కనిపించారు. సాధారణంగా కార్పొరేట్ దిగ్గజాలు లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు, కానీ దారా మాత్రం మెట్రోను ఎంచుకోవడం విశేషం. ఢిల్లీ మెట్రో సేవలను ఆయన కొనియాడారు. “మెట్రో ప్రయాణం వేగవంతమైనది, చౌకైనది , అత్యంత నమ్మదగినది” అని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

Uber CEO Delhi Metro|నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..

రద్దీ సమయాల్లో ఉబర్ సీఈఓ కూడా తన యాప్ కంటే మెట్రోనే వేగవంతమైనదని భావించారని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ ట్రాఫిక్ ఎంతటి వారినైనా మెట్రో ఎక్కేలా చేస్తుందని మరికొందరు నవ్వుకుంటున్నారు.

Uber CEO Delhi Metro|టెక్నాలజీ కలయిక..

భారతదేశంలో ఉబర్ యాప్ ద్వారా ఇప్పటివరకు కోటికి పైగా మెట్రో టికెట్లు బుక్ అయ్యాయని ఖోస్రోషాహి వెల్లడించారు. ఈ విజయంలో ONDC (Open Network for Digital Commerce) పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉబర్ కేవలం ట్యాక్సీలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ రవాణా వ్యవస్థలతో కలిసి పనిచేయాలనే లక్ష్యాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Uber CEO Delhi Metro|జాయింట్ టికెటింగ్..

గత ఏడాది (మే 2025) ఢిల్లీ మెట్రో , ఉబర్ సంస్థలు కలిసి ‘జాయింట్ టికెటింగ్’ విధానాన్ని ప్రారంభించాయి. మెట్రోలో ప్రయాణించి, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబర్ ఆటో లేదా బైక్ బుక్ చేసుకునేలా ఈ సౌకర్యం కల్పించారు. ఒక గ్లోబల్ టెక్ సీఈఓ ఇలా సాదాసీదాగా మెట్రోలో ప్రయాణించడం, భారతీయ రవాణా వ్యవస్థల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Convoy | సీఎం రేవంత్​రెడ్డి కాన్వాయ్​లో వాహనాల తగ్గింపు!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vivo X300 Ultra | ఫొటోగ్రఫీ లవర్స్ కోసం.. వీవోనుంచి మరో ఫోన్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo X300 Ultra | చైనాకు చెందిన...

Singareni New Jobs | కొత్త గనులు, కొత్త ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వివేక్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni New Jobs | సింగరేణికి పూర్వ...

Red Fort Bomb Blast|ఎర్రకోట బాంబు పేలుడు కేసు.. 10 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ భారీ ఛార్జిషీట్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Red Fort Bomb Blast|ఢిల్లీలోని ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) వద్ద...

Korea Stock Market Rally | దుమ్ము రేపుతున్న కొరియన్ మార్కెట్.. ఏడాదిలో 225 శాతం ర్యాలీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Korea Stock Market Rally | దక్షిణ కొరియా...