అక్షరటుడే, వెబ్‌డెస్క్:Chandrababu Convoy Reduction | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యలలో భాగంగా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించారు.
పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని మోదీ సూచించడంతో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకున్నారు. నాలుగు వాహనాలతో సచివాలయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. సీఎం భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు మంత్రుల కాన్వాయ్ సైతం తగ్గించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సైతం కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించారు.
Chandrababu Convoy Reduction | మంత్రులు సైతం
మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సైతం తన వాహనాల సంఖ్య తగ్గించారు. 3 వాహనాల కాన్వాయ్‌తోనే ఆయన సచివాలయానికి వెళ్లారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క వాహనంలోనే కేబినెట్ సమావేశానికి వచ్చారు. మంత్రి లోకేశ్ సైతం పొదుపు చర్యలు చేపట్టారు. ఆయన ఒక్క వాహనంలో రాగా, భద్రత సిబ్బంది కోసం బస్సు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, హైబ్రిడ్ విధానం అమలు చేసేలా ఆలోచిస్తోంది.
ఇది కూడా చదవండి..: Amaravati Development| బంగారం కొనకండి.. పొదుపు పెంచండి: సీఎం చంద్రబాబు


