అంతర్జాతీయంTrump Secret Letter| ట్రంప్ పర్యటన వేళ జేడీ వాన్స్‌కు 'సీక్రెట్ లెటర్'.. అందులో ఏముంది?

Trump Secret Letter| ట్రంప్ పర్యటన వేళ జేడీ వాన్స్‌కు ‘సీక్రెట్ లెటర్’.. అందులో ఏముంది?

అక్షరటుడే వెబ్‌డెస్క్:Trump Secret Letter|అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతిసారీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కోసం ఒక రహస్య లేఖను రాసి ఉంచుతారట. ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికారి సెబాస్టియన్ గోర్క్ తాజాగా వెల్లడించారు.

Trump Secret Letter|ఆ లేఖలో ఏముంటుంది?

వైట్‌హౌస్‌లోని తన అధికారిక ‘రిజల్యూట్ డెస్క్’లో ట్రంప్ ఈ లేఖను భద్రపరుస్తారు. ఒకవేళ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తనకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, దేశ బాధ్యతలను ఎలా స్వీకరించాలి, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనే అంశాలపై ఉపాధ్యక్షుడికి ట్రంప్ ఇందులో దిశానిర్దేశం చేస్తారని గోర్క్ వివరించారు. అయితే ప్రోటోకాల్ నిబంధనల దృష్ట్యా ఆ లేఖలోని పూర్తి వివరాలను వెల్లడించలేమన్నారు. గతంలో ట్రంప్‌పై జరిగిన వరుస హత్యాయత్నాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Trump Secret Lette|నవ్వించిన జేడీ వాన్స్ వ్యాఖ్యలు..

మరోవైపు, అధ్యక్షుడితో పాటు కీలక అధికారులంతా చైనా పర్యటనలో ఉండటంతో వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒంటరి అయిపోయారు. భద్రతా నిబంధనల ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లకూడదు. ఈ క్రమంలో వాన్స్ విలేకరులతో సరదాగా మాట్లాడుతూ.. “నేను ఇప్పుడు వైట్‌హౌస్‌కు వెళ్లాలి, అక్కడ ఎవరూ ఉండరు. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికే నాకు సమయం పడుతుంది” అని వ్యాఖ్యానించారు. తన పరిస్థితిని 1990 నాటి ప్రసిద్ధ చిత్రం ‘హోమ్ అలోన్’లోని మెకాలే కల్కిన్ పాత్రతో పోల్చడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

Trump Secret Letter|తైవాన్ విషయంలో జిన్‌పింగ్ హెచ్చరిక..

ట్రంప్ పర్యటన కొనసాగుతుండగానే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ అంశంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ, ఆయన చాలా సురక్షితంగా ఉన్నారని సెబాస్టియన్ గోర్క్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Red Fort Bomb Blast|ఎర్రకోట బాంబు పేలుడు కేసు.. 10 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ భారీ ఛార్జిషీట్

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Voter List Revision| మూడో దశ ఎస్‌ఐఆర్‌ షురూ.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Voter List Revision|భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాలను...

Bakrid Security Measures | బక్రీద్‌కు పటిష్ట భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Security Measures | రానున్న బక్రీద్ (Bakrid)...

Hyderabad Fire Accident | ఫర్నిచర్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)​...