అక్షరటుడే, వెబ్డెస్క్ : Tamil Nadu Explosion | తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు.
తమిళనాడులోని విరుదునగర్ (Virudhunagar)లోని కట్టనార్‌పట్టి ప్రాంతంలో ఆదివారం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పి వేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పేలుడు ధాటికి భవనంలోని కొంతభాగం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu Explosion | సీఎం సంతాపం
ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) స్పందించారు. విరుదునగర్ జిల్లా, కట్టనార్‌పట్టిలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద వార్త తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.
Tamil Nadu Explosion | రాష్ట్రపతి దిగ్భ్రాంతి
తమిళనాడులోని బాణసంచా కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా తమిళనాడు మంత్రులు కె. కె. ఎస్. ఎస్. ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసులను వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
📍Virudhunagar, Tamil Nadu: Explosion reported at a firecracker factory in the district, leaving at least 13 people dead. Rescue operations are currently underway.#TamilNadu #Virudhunagar#firecracker pic.twitter.com/F8GB2AqE4K
— Shining India News (@shiningindnews) April 19, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Rains | హైదరాబాద్లో వర్షం.. పలుచోట్ల వడగళ్ల వాన..

