హైదరాబాద్Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

బండి భగీరథ్​పై పోలీసులు లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై పోలీసులు లుక్​ అవుట్​ నోటీసులు (Lookout Notices) జారీ చేశారు. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

భగీరథ్​పై హైదరాబాద్ నగరంలోని పేట్​ బషీరాబాద్ పోలీస్​ స్టేషన్​ (Bashirabad Police Station)లో పోక్సో కేసు నమోదు అయింది. ఈ నెల 8న కేసు నమోదు కాగా.. విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే భగీరథ్​ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతడి ఫోన్​ స్విచ్​ ఆఫ్​లో ఉంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశారు.

Bandi Bhagirath Case | 4 బృందాలతో గాలింపు

పోక్సో కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని బండి భగీరథ్​ (Bandi Bhagirath) హైకోర్టులో పిటిషన్​ వేశారు. అయితే బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏ ఎయిర్‌పోర్టులో కనిపించినా.. వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితుడి కోసం 4 టీమ్స్ ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా.. కోర్టు బెయిల్​ పిటిషన్​ కొట్టివేయడంతో ఒకటి రెండు రోజుల్లో భగీరథ్​ లొంగిపోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Streenidhi | స్త్రీనిధితో మహిళల ఆర్థిక స్వావలంబన : మంత్రి సీతక్క

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Streenidhi | ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ...

Fuel Price Protest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై జీఎస్టీని ఎత్తివేయాలి

అక్షరటుడే,కోటగిరి: Fuel Price Protest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు...

Chandrababu Population Policy | మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandrababu Population Policy | ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి...