Bheemgal Town | భీమ్​గల్​ పట్టణాభివృద్ధికి అందరి సహకారం అవసరం

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Town | ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పట్టణంలోని వార్డులన్నింటినీ (Bheemgal Municipality) ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ బోదిరె నాగమణి స్వామి (Bodire Nagamani) హామీ ఇచ్చారు. స్థానిక పురపాలక కార్యాలయంలో (Bheemgal) శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు.

Bheemgal Town | ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా..

ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్ ముందుకు సాగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్ మాట్లాడుతూ.. ఈ సాధారణ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించిన పలు ముఖ్యాంశాలు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. వార్డుల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

వివిధ వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌ సంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ, పర్స కుశలత, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మి, బోదిరే లావణ్య, మహమ్మద్ అంజుమ్ అలీ, మమరి సందీప్, సంధ్య మాలావత్, మల్లెల అనుపమ, మున్సిపల్ అధికారులతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ACB Trap | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ లైన్​మన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *