నిజామాబాద్Medicover Hospitals | మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక బైపాస్, మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీలు

Medicover Hospitals | మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక బైపాస్, మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీలు

హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్‌లోనే అత్యాధునిక గుండె శస్త్రచికిత్సలు మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్​లో అందుబాటులో ఉన్నాయని కార్డియో వాస్క్యూలర్ సర్జన్ రాకేష్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అక్షరటుడే, ఇందూరు: Medicover Hospitals | హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిజామాబాద్‌లోనే అత్యాధునిక గుండె శస్త్రచికిత్సలు మెడికోవర్(Medicover) హాస్పిటల్స్ నిజామాబాద్​లో అందుబాటులో ఉన్నాయని కార్డియో వాస్క్యూలర్ సర్జన్ (Cardiovascular Surgeon) రాకేష్ తెలిపారు.

బైపాస్ సర్జరీలు (bypass surgery), వాల్వ్ సర్జరీలు, మినిమల్లి ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలు (Minimally Invasive Cardiac Surgery) విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Medicover Hospitals | యువతలో గుండె సంబంధిత వ్యాధులు

ప్రస్తుతం యువతలో గుండె సంబంధిత వ్యాధులు కూడా వేగంగా పెరుగుతున్నాయని, సమయానికి చికిత్స అందక చాలామంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడినప్పుడు బైపాస్ సర్జరీ ద్వారా గుండెకు కొత్త రక్తప్రసరణ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు.

మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అనేది సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీతో పోలిస్తే చిన్న గాయాలతో చేసే ఆధునిక శస్త్రచికిత్స విధానమని డాక్టర్​ రాకేష్ తెలిపారు. సాధారణంగా ఛాతిని పూర్తిగా తెరవకుండా చిన్న రంధ్రాల ద్వారా సర్జరీ నిర్వహించడం వల్ల రోగికి నొప్పి తక్కువగా ఉండటంతో పాటు రక్తనష్టం కూడా తగ్గుతుందన్నారు. ఈ విధానంతో రోగులు త్వరగా కోలుకొని తక్కువ రోజుల్లోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్లగలుగుతున్నారని పేర్కొన్నారు.

Medicover Hospitals | మెడికవర్​ ఆస్పత్రిలో అత్యాధునిక కార్డియాక్​..

ప్రస్తుతం మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో అత్యాధునిక కార్డియాక్ ఓటీ, ఏసీయూ(ICU), అనుభవజ్ఞులైన కార్డియాక్ అనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందంతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యుడు రాకేష్​ తెలిపారు.

హైదరాబాద్ స్థాయి గుండె వైద్య సేవలు ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమన్నారు. అత్యవసర గుండెపోటు కేసుల్లో ప్రతి నిమిషం కీలకమని, చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో నిజామాబాద్‌లోనే(Nizamabad) అత్యవసర గుండె చికిత్సలు అందించడం వల్ల అనేక మంది రోగుల ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలిపారు.

Medicover Hospitals | బైపాస్​ సర్జరీ అంటే భయపడే అవసరం లేదు..

బైపాస్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో సర్జరీలు అత్యంత సురక్షితంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం బహుళ బ్లాకేజీలు ఉన్న రోగులకు బైపాస్ సర్జరీ దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు ఇస్తుందని వివరించారు.

సర్జరీ అనంతరం రోగులు ధూమపానం పూర్తిగా మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్యుల సూచనల ప్రకారం వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.

మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీలు, మినిమల్లి ఇన్వేసివ్ హార్ట్ సర్జరీలు, పోస్ట్ కార్డియాక్ రిహాబిలిటేషన్ సేవలు ఒకేచోట అందిస్తున్నామన్నారు.

Medicover Hospitals | ఛాతిలో నొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుండె పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్​ రాకేష్ సూచించారు.

సమయానికి చికిత్స తీసుకుంటే గుండె జబ్బులను పూర్తిగా నియంత్రించ వచ్చన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకొని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అత్యాధునిక గుండె వైద్యం ఇప్పుడు నిజామాబాద్‌లోనే మెడికోవర్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉందన్నారు.

ఇది కూడా చదవండి: AI Social Media Surveillance | ఏఐతో సోషల్​ మీడియాపై నిఘా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ...