అక్షరటుడే, వెబ్‌డెస్క్: First Angiogram Nizamabad | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు తెలిపారు.
First Angiogram Nizamabad | ముఖ్యమైన మైలురాయిగా
సింకోపల్ అటాక్స్‌తో బాధపడుతున్న యాదయ్య అనే వ్యక్తికి యాంజియోగ్రామ్ విజయవంతంగా జరిపినట్లు పేర్కొన్నారు. కార్డియాలజీ, వైద్య బృందం సమష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని డా. నాగ మోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో రోగులకు సత్వర సేవలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.


