క్రీడలుDhoni Farewell | ధోనీకి చెపాక్‌లో వీడ్కోలా..? సీఎస్కే చివరి హోమ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ

Dhoni Farewell | ధోనీకి చెపాక్‌లో వీడ్కోలా..? సీఎస్కే చివరి హోమ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి హోమ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా అభిమానుల దృష్టి ఎంఎస్ ధోనీపై పడింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhoni Farewell | ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) తమ సొంత మైదానమైన M. A. చిదంబ‌రం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు ఇది చివరి హోమ్ మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

చెపాక్ స్టేడియం మరోసారి పసుపు రంగులో మెరిసిపోనుంది. అయితే మ్యాచ్ ఫలితంపై కంటే మాజీ కెప్టెన్ ధోని (MS Dhoni) ఆడతాడా లేదా అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ సెషన్లలో గాయపడిన ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో చివరి హోమ్ మ్యాచ్‌లోనైనా ఆయన మైదానంలో కనిపిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

 Dhoni Farewell | గ‌తంలో వ్యాఖ్య‌లు వైరల్..

ధోనీ గతంలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. 2021లో జరిగిన సీఎస్కే అధికారిక కార్యక్రమంలో తన క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో తన చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో జరగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను అభిమానులు ఆసక్తిగా విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ధోనీ త్వరలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాలని భావిస్తే, చెపాక్‌లో జరిగే ఈ మ్యాచ్ ఆయనకు భావోద్వేగ వీడ్కోలు మ్యాచ్‌గా మారే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు లేదు.

 Dhoni Farewell | బెంచ్​కే పరిమితం

ఇక గాయం పరిస్థితిని పరిశీలిస్తే, ధోనీ ఫిట్‌నెస్ పూర్తిగా కోలుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో ఆయన ఆడతారనే అంచనాలు ఉన్నప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యారు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్ ఆయనను కేవలం భావోద్వేగ కారణాలతో తుది జట్టులోకి తీసుకుంటుందా, లేక జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నాయకత్వంలో సీఎస్కే ప్లేఆఫ్స్ రేసులో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ధోనీ ఆడితే అది కేవలం జట్టుకే కాదు అభిమానులకు కూడా ప్రత్యేక క్షణంగా మారే అవకాశం ఉంది. చెన్నై నగరానికి, అక్కడి అభిమానులకు ధోనీతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఒకవేళ ఆయన ఫిట్‌నెస్ సాధించి చెపాక్ మైదానంలో అడుగుపెడితే, స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనిని కూడా చదవండి : Hardik Pandya Auction | హార్దిక్ కోసం ఐపీఎల్ జట్ల మధ్య పోటీ?.. మెగా వేలంలో కోట్ల వర్షం ఖాయమే!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...