అంతర్జాతీయంEbola Virus Outbreak | సరిహద్దులు దాటుతున్న ఎబోలా వైరస్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన...

Ebola Virus Outbreak | సరిహద్దులు దాటుతున్న ఎబోలా వైరస్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

ఆఫ్రికా ఖండంలో ఎబోలా (Ebola) వైరస్ కలకలం రేపుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రంగంలోకి దిగింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Virus Outbreak | ఆఫ్రికా ఖండంలో ఎబోలా (Ebola) వైరస్ కలకలం రేపుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రంగంలోకి దిగింది. పరిస్థితి తీవ్రతను బట్టి దీనిని ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ (అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా డబ్ల్యూహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్ మరింతగా విస్తరించకుండా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Ebola Virus Outbreak | పొరుగు దేశాలకూ ముప్పు..

కాంగో, ఉగాండా దేశాలలో ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత ఎబోలా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి 88 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. కాంగోలో మొదలైన ఈ వైరస్ వ్యాప్తి, ప్రస్తుతం సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాకు కూడా పాకింది. అంతర్జాతీయ ప్రయాణాలు, సరిహద్దుల ద్వారా ఇది ఇతర దేశాలకు విస్తరించకుండా ఉండాలంటే తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ebola Virus Outbreak | వేగంగా అందనున్న అంతర్జాతీయ సాయం..

ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమై సమీక్ష నిర్వహించింది. అనంతరం దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ (PHEIC) గా ప్రకటించింది. ఈ అత్యవసర ప్రకటన వల్ల బాధిత దేశాలకు అంతర్జాతీయ సమాజం నుండి ప్రత్యేక నిధులు, అవసరమైన వ్యాక్సిన్లు, వైద్య సాయం వేగంగా అందుతాయి.

Ebola Virus Outbreak | లక్షణాలు..

ఎబోలా అనేది అత్యంత వేగంగా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన వైరస్. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే అంతర్గతంగా , బాహ్యంగా రక్తస్రావం (Bleeding) జరుగుతుంది. ఇది సోకిన రోగుల శరీర ద్రవాల (రక్తం, లాలాజలం వంటివి) ద్వారా ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే, కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TG EAPCET Results | తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...