Pavala Syamala Health | దిక్కులేని స్థితిలో పావ‌లా శ్యామ‌ల .. అండగా నిలిచిన దిల్ రాజు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavala Syamala Health | తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి పావలా శ్యామల (Pavala Syamala) ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) వెంటనే స్పందించి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పావలా శ్యామల చికిత్స పొందుతున్న ఆస్పత్రికి దిల్ రాజు తన టీంను పంపించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అలాగే చికిత్సలో ఎటువంటి లోపం ఉండకూడదని, అవసరమైన అన్ని సదుపాయాలు అందించాలని వైద్య సిబ్బందికి తెలియజేసినట్లు సమాచారం.

Pavala Syamala Health | దిల్ రాజు సాయం..

తమ బృందం నిరంతరం సంప్రదింపుల్లో ఉంటుందని, తాను కూడా ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని దిల్ రాజు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు సహాయం గురించి ఆయన బృందం ఆస్పత్రిలో పావలా శ్యామలకు వివరించగా, ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు (Dil Raju) కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా తనకు పలు సందర్భాల్లో ఆయన సహాయం చేశారని, మరోసారి తనను ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pavala Syamala Health | నిలకడగా ఆరోగ్యం

పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో ఆమె అధిక రక్తపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, పార్కిన్సన్స్ సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, క్రమం తప్పకుండా మందులు వాడకపోవడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిందని తెలిపారు. శనివారం ఉదయం కడుపు నొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు వెల్లడించారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. వైద్య బృందం ఆమె పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, తదుపరి చికిత్స అనంతరం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పావలా శ్యామల ( Pavala Syamala Health ) పరిస్థితి అంతకుముందు మరింత ఆందోళన కలిగించేలా మారింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో శుక్రవారం కూకట్​పల్లిలోని ఒక ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన సహాయం అందలేదని సమాచారం. అనంతరం క్యాబ్‌లో వచ్చిన ఆమెను కేపీహెచ్‌బీ వై జంక్షన్ వద్ద దించివేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫుట్‌పాత్‌పై అసహాయ స్థితిలో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఆర్‌కే ఫౌండేషన్ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి Private Hospital తరలించి చికిత్స అందించారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు తక్షణమే స్పందించి, ఆమెకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దీనిని కూడా చదవండి : Jayam Ravi Divorce | ‘నా భార్య విడాకులు ఇచ్చేవరకు సినిమాలు చేయను’ – జయం రవి సంచలన ప్రకటన!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *