Vasuki Nagabhushana | శివయ్య మెడలో పాము ఎందుకుంటుంది.. ఆ సర్పానికి, విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?

Naresh Chandan
Vasuki Nagabhushana

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vasuki Nagabhushana | హిందూHindu పురాణాలలో పరమేశ్వరుని రూపం అత్యంత విలక్షణమైనది. విభూతి రేఖలు, త్రిశూలం Trishul, నెత్తిన గంగ ganga తో పాటు ఆయన మెడలో నిరంతరం దర్శనమిచ్చే నాగాభరణం విశేషమైనది. ఆ నాగరాజు పేరు వాసుకి Vasuki. అసలు ఒక సర్పం సాక్షాత్తు ఆ కైలాసనాథుడి మెడలో స్థానం సంపాదించుకోవడం వెనుక ఒక గొప్ప త్యాగం, అంతకు మించిన భక్తి దాగి ఉన్నాయి.

Vasuki Nagabhushana | ఆ కథా విశేషాలు ఇవే:

పందెం – ప్రాణ సంకటం: కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం సర్పజాతికి పెద్ద శాపంగా మారింది. పాలసముద్రం నుంచి పుట్టిన తెల్లని గుర్రం ‘ఉచ్చైశ్రవం’ తోక రంగుపై వీరిద్దరూ పందెం కట్టుకున్నారు. గుర్రం తోక నల్లగా ఉంటుందని కద్రువ, తెల్లగానే ఉంటుందని వినత వాదించుకున్నారు.

ఓడిన వారు గెలిచిన వారికి వెయ్యి ఏళ్ల పాటు సేవ చేయాలన్నది పందెం. నిజానికి ఆ గుర్రం పూర్తిగా తెల్లనిదే అయినప్పటికీ, ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కద్రువ తన కుమారులైన సర్పాలను పిలిచి, గుర్రం తోకకు చుట్టుకుని అది నల్లగా కనిపించేలా మాయ చేయమని కోరుతుంది.akshara today .jpgshiva

Vasuki Nagabhushana | తల్లి శాపం – ధర్మ పోరాటం:

అధర్మమైన ఈ పని చేయడానికి కద్రువ కుమారులు నిరాకరించారు. తల్లి మాట జవదాటినందుకు ఆగ్రహించిన కద్రువ.. భవిష్యత్తులో జనమేజయుడు చేసే ‘సర్పయాగం’లో పడి మీరంతా భస్మమైపోతారని తన బిడ్డలనే శపించింది. ఈ శాపంతో భయపడిన కొందరు సర్పాలు వెళ్లి తల్లి చెప్పినట్లు గుర్రం తోకకు చుట్టుకుని వినతను మోసగిస్తాయి. కానీ, కద్రువ పెద్ద కుమారులైన ఆదిశేషుడు, వాసుకి మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. తల్లి పెట్టిన శాపంతోపాటు మృత్యు భయం నుంచి ఎలా బయటపడాలో తెలియక వారు తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు.

akshara today 1 1.jpgvasuki 1

Vasuki Nagabhushana | శేషతల్పం, నాగాభరణం:

పెద్దవాడైన ఆదిశేషుడు శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకుని, ఆయనకు శేషతల్పంగా (పాన్పుగా) మారిపోయాడు. తద్వారా వైకుంఠంలో స్వామి సేవలో తరిస్తూ అమరత్వాన్ని పొందాడు. ఇక రెండో వాడైన వాసుకి పరమశివుని శరణు వేడాడు. కఠోరమైన తపస్సుతో లయకారుడిని మెప్పించాడు. వాసుకి నిశ్చల భక్తికి, ధర్మనిరతికి ముగ్ధుడైన బోళాశంకరుడు.. “ఇకపై నీకు మృత్యు భయం లేదు, నా మెడలో ఆభరణంగా ఉండిపో” అని వరమిచ్చాడట.

అప్పటి నుంచి వాసుకి శివుని మెడలో నాగాభరణమై భక్తులకు దర్శనమిస్తున్నాడు. మృత్యుంజయుడైన శివుడి చెంత చేరడం వల్ల వాసుకికి మరణం లేని స్థితి లభించింది. పాములను సైతం ప్రేమతో ఆదరించి, తన శరీరంలో భాగం చేసుకున్న ఆ దయామయుడిని మనం నాగభూషణుడు అని పిలుచుకుంటాం. ఈ గాథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని వీడకుండా భగవంతుని నమ్ముకుంటే, సాక్షాత్తు ఆ దేవుడే మనల్ని అక్కున చేర్చుకుంటాడు.

ఇది కూడా చదవండి:KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *