అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Kutumba Jeevitha Bima | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP)’ ప్రారంభానికి ముహూర్తం ఖరారు కాబోతోంది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలనే చారిత్రాత్మక సంకల్పంతో ఈ సార్వత్రిక బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకువస్తోంది.
Indiramma Kutumba Jeevitha Bima | అత్యవసర భేటీ
ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను అత్యంత వేగంగా ఖరారు చేసేందుకు రేపు (మే 19, 2026) సాయంత్రం 5:00 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub-Committee) అత్యవసరంగా భేటీ కానుంది.
Indiramma Kutumba Jeevitha Bima | భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభ్యులుగా పాల్గొననున్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంపై సంబంధిత అధికారులు, స్టేక్‌హోల్డర్లతో ఈ కమిటీ సమగ్రంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనుంది. ప్రతి ఇంటా భరోసా నింపే ఈ బృహత్తర పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Telangana Government GO 685 | ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ‘అదర్ డ్యూటీ’ సౌకర్యం.. ఉత్తర్వులు జారీ


