అంతర్జాతీయంRupee Value Fall | ఆల్​టైం కనిష్టానికి రూపాయి విలువ.. డాలర్ దెబ్బకు విలవిల..

Rupee Value Fall | ఆల్​టైం కనిష్టానికి రూపాయి విలువ.. డాలర్ దెబ్బకు విలవిల..

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ సమీకరణాల వల్ల రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rupee Value Fall | ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ సమీకరణాల వల్ల రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆల్​టైం కనిష్టానికి పడిపోయింది. డాలర్‌ (Dollar)తో పోలిస్తే భారత రూపాయి విలువ 20 పైసలు క్షీణించి.. 96.90 చేరింది.

Rupee Value Fall | అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో

ఇరాన్ – అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌ (Global Market)లో డాలర్ ఇండెక్స్ బలోపేతం అయ్యింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడాయిల్ రేటు భారీగా పెరిగాయి. దీంతో ఈ ప్రభావం రూపాయిపై పడి చరిత్రలో కనిష్టస్థాయికి పడిపోయింది.

Rupee Value Fall | అత్యధికంగా చమురు దిగుమతులపై ఆధారపడడంతో

భారత్​ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల చమురు ధరలు పెరిగిన సమయంలో దేశం నుంచి డాలర్ల చెల్లింపు పెరుగుతోంది. ఈ కారణంగా రూపాయి విలువ మరింత తగ్గుతోంది. ఒకవైపు క్రూడ్​ ఆయిల్​ ధరలు పెరగడం, మరోవైపు రూపాయి విలువ దిగజారడం వల్ల దేశంలోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, ముడిసరుకులు మరింత పెరిగి ఛాన్స్​ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దేశీయంగా ధరల పెరుగుదలకు కూడా దారితీసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Crude oil prices | ఆయిల్ ధరలు పడిపోతాయ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...