Dental Care Tips|దంత సమస్యలా.. ‘డాబర్ రెడ్ పేస్ట్’తో చెక్ పెట్టండిలా

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Dental Care Tips|చాలా మంది పంటి నొప్పి తీవ్రంగా మారేంత వరకు దంత సమస్యలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, పంటి సమస్యలు లోలోపలే పెరిగి పెద్దదవడంపై దంత వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిప్పి పళ్ళు, చిగుళ్ళ వ్యాధులు వంటి చాలా సమస్యలు ప్రారంభంలో ఎలాంటి నొప్పి లేదా బయటకు కనిపించే లక్షణాలు లేకుండానే మొదలవుతాయి. దీనివల్ల చాలా మంది డాక్టర్‌ దగ్గరకు వెళ్లడాన్ని వాయిదా వేస్తుంటారు. ఈ అలసత్వం వల్ల చిన్న సమస్యలే కాస్తా పెద్దవిగా మారి, పేషెంట్ గుర్తించే లోపే పళ్ళు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పంటిలో నొప్పి లేదా ఇబ్బంది బయటకు తెలిసే సమయానికి, సమస్య అప్పటికే చాలా ముదిరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Dental Care Tips|గార పట్టడం..

ఓరల్ హైజీన్‌ను (నోటి పరిశుభ్రత) నిర్లక్ష్యం చేయడం వల్ల లోలోపలే సమస్య ఎలా పెరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం పళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే, కేవలం కొన్ని రోజుల్లోనే పళ్ళపై ఉండే జిగట పొర కాస్తా గట్టిపడి ‘గార’లాగా మారుతుంది. ఈ గార ఒక్కసారి ఏర్పడితే, మనం మామూలుగా బ్రష్ చేయడం ద్వారా దానిని వదిలించలేము. ఇది చివరకు చిగుళ్ళ వాపు, పంటి పైపొర (Enamel) దెబ్బతినడం , పళ్ళు ఊడిపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల చిన్నపాటి చికిత్సతో నయమయ్యే సమస్య కాస్తా.. ఎక్కువ ఖర్చుతో కూడిన పెద్ద ఆపరేషన్లు లేదా రూట్ కెనాల్ వంటి కష్టమైన ట్రీట్‌మెంట్‌లు చేయించుకునే స్థితికి చేరుకుంటుంది.

Dental Care Tips|డాబర్ రెడ్ పేస్ట్..

ఈ దంత సమస్యల ముప్పును ఎదుర్కొనేందుకు, మన పెద్దల కాలం నాటి సహజ నివారణలను ఆధునిక విజ్ఞానంతో ముడిపెడుతూ నివారణా చర్యలపై ఇప్పుడు సరికొత్తగా దృష్టి పెడుతున్నారు. లవంగాలు , వేప వంటి ఆయుర్వేద మూలికలకు హానికరమైన బ్యాక్టీరియాను అరికట్టే , చిగుళ్ళ వాపును తగ్గించే గొప్ప శక్తి ఉన్నట్లు ఎప్పటి నుంచో నిరూపితమైంది. ప్రముఖ బ్రాండ్ డాబర్ రెడ్ పేస్ట్ (Dabur Red Paste) ఈ సాంప్రదాయ మూలికల గుణాలను క్లినికల్‌గా పరీక్షించిన తన రోజువారీ ఫార్ములాలో పొందుపరిచింది. ఈ పేస్ట్‌కు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) గుర్తింపు ముద్ర కూడా లభించింది. ఇది పళ్ళపై గార పట్టకుండా చేసి, తీవ్రమైన దంత సమస్యలు రాకుండా కాపాడటంలో సైంటిఫిక్‌గా నిరూపితమైన సాధనంగా ఎంతగానో సహాయపడుతుంది.

Dental Care Tips|నిపుణులు సూచిస్తున్న ఆరోగ్య సూత్రాలు..

దీర్ఘకాలం పాటు పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సమస్య వచ్చాక చికిత్స చేయడం కంటే, రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రముఖ ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ సోనియా దత్తా వివరించారు. రోజూ రెండు సార్లు ఐడీఏ (IDA) గుర్తింపు పొందిన ‘డాబర్ రెడ్ పేస్ట్’తో పళ్ళు తోముకోవాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న మురికిని ప్రత్యేకమైన దారంతో (Flossing) శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి. నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉండటానికి స్వీట్లు, చాక్లెట్లు తినడం తగ్గించాలి. క్రమం తప్పకుండా దంత వైద్యుడిని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే, ఎలాంటి సమస్యలైనా ప్రారంభ దశలోనే గుర్తించి సులభంగా నయం చేయవచ్చు.

ఈ రోజువారీ అలవాట్లతో మన అందమైన చిరునవ్వును కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో వచ్చే శారీరక నొప్పులను, పంటి చికిత్సల కోసం అయ్యే భారీ ఖర్చులను తప్పించుకోవచ్చని డాక్టర్ సోనియా దత్తా సూచించారు.

ఇది కూడా చదవండి: Caste Census Support| బీసీలు ఎదగడం మోదీకి ఇష్టం లేదు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *