Streenidhi Loan Scheme | డ్వాక్రా మహిళలకు గుడ్​న్యూస్​.. రూ.రెండు లక్షల లోన్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:Streenidhi Loan Scheme | డ్వాక్రా సంఘం మహిళలకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్​ న్యూస్​ చెప్పింది. స్త్రీ నిధి ద్వారా ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష రుణానికి అదనంగా మరో రూ.లక్ష ఇవ్వడానికి నిర్ణయించింది.

రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు అందిస్తున్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా సంఘంలోని మహిళలు అందరికి లోన్​ ఇస్తుండగా.. స్త్రీ నిధి ద్వారా.. స్వయం ఉపాధి కోసం చిన్న వ్యాపారాలు పెట్టుకునే మహిళలకు రూ.లక్ష వరకు ప్రస్తుతం రుణం అందిస్తున్నారు. దీనిని రూ.రెండు లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఒక్కో సభ్యురాలికి స్త్రీనిధి కింద గరిష్ఠంగా రూ.2 లక్షల దాకా రుణంగా ఇవ్వనుంది.

Streenidhi Loan Scheme

Streenidhi Loan Scheme | 48 గంటల్లో..

మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణం మొత్తాన్ని పెంచింది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్‌ ఫీజులు (Documentation Fees) ఏమీ లేకుండా.. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణం అందించనుంది. ఈ డబ్బులకు 11శాతం వడ్డీ ఉంటుంది. గతంలో రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్న సభ్యులకే ఈ రుణం అందించనుంది. దీనిపై సెర్ప్​ అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించనున్నారు.
డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకుస్త్రీనిధి కింద ఇచ్చే రూ.2 లక్షల రుణంతో పాటు ఉన్నతి పథకం కింద మరో రూ.లక్ష ఇవ్వనున్నారు. దీనికి ఎలాంటి వడ్డీ ఉండదు. ఆసక్తి ఉన్న మహిళలు రుణం తీసుకొని వ్యాపార రంగంలోని రాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: RTC Workers Strike | సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. చర్చలకు పిలవని ప్రభుత్వం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *