AP FDC ఛైర్మన్​గా భరత్ భూషణ్.. వైస్ ఛైర్మన్​గా మెహర్ రమేష్.. డైరెక్టర్లుగా మరో 14 మంది నియామకం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: AP FDC | ఎట్టకేలకు ఫిల్మ్ టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ (FDC) ఛైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్​గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి.భరత్ భూషణ్ ను ఖరారు చేసింది. వైస్ ఛైర్మన్​గా దర్శకుడు మెహర్ రమేష్​ను ఎంపిక చేసింది.

AP FDC | సముచిత స్థానం..

వీరికితోడు 14 మంది డైరెక్టర్లను నియమించింది. సినీ రచయిత writers, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్రా సాయి మాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావులను డైరెక్టర్లుగా నియమించింది.

అలాగే ప్రముఖ నటులు Actors సుమన్ తల్వార్, శివాజీ, నిర్మాతలు Producers చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, నటి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు, దర్శకుడు వి. సముద్ర, మీర్ ఎస్., ఎ.సత్యనారాయణ, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణను డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP FDC | ఈ వేడుకల పర్యవేక్షణ..

ఇకపై టీవీ, సినిమా నంది అవార్డులు Awards, నంది Nandi నాటకోత్సవాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్​లో సినిమా, టీవీ షూటింగులు జరిగేందుకు, సినీ, టీవీ, రంగస్థల కళాకారుల అభివృద్ధికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి Nara చంద్రబాబు Naidu ఆదేశించారు.

Telugu States Summer | పల్నాడులో 48.1 డిగ్రీలు.. బయ్యారంలో 46.20…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *