అక్షరటుడే వెబ్‌డెస్క్:RBI Dividend Transfer|కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ ఆర్థిక ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) గాను ఏకంగా రూ. 2.87 లక్షల కోట్ల డివిడెండ్లు ప్రభుత్వానికి బదిలీ చేయనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఆర్‌బీఐ చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వానికి ఇంతపెద్ద మొత్తంలో నిధులను బదిలీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
RBI Dividend Transfer|డివిడెండ్ బదిలీకి ఆమోదం..
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన కేంద్ర బోర్డు 608వ సమావేశంలో ఈ రికార్డు స్థాయి డివిడెండ్ బదిలీకి ఆమోదం తెలిపారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం, ఆర్‌బీఐకి విదేశీ మారక నిల్వల (Foreign Exchange) నిర్వహణ , ఇతర పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు రావడంతోనే ఈ స్థాయి డివిడెండ్లు సమకూరినట్లు తెలుస్తోంది.
RBI Dividend Transfer|ఆర్థిక రికార్డులు బద్దలు..
గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఆర్‌బీఐ బదిలీ చేసిన నిధుల పరిమాణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్ లక్ష్యాల కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో, భవిష్యత్తులో వచ్చే ఎలాంటి ఆర్థిక ఒడిదొడుకులనైనా తట్టుకునేందుకు వీలుగా ఉండే ‘కంటింజెన్సీ రిస్క్ బఫర్’ (Contingency Risk Buffer) శాతాన్ని కూడా ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సురక్షితమైన స్థాయిలోనే కొనసాగించింది.
ఇది కూడా చదవండి: Telangana Farmers Protest| తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి.. కవిత డిమాండ్


