SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది.

SRH vs RCB | మెరుపు హాఫ్ సెంచరీలతో..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్ (51) మెరుపు హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించారు.

వెంకటేష్ అయ్యర్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.

SRH vs RCB | మలింగ, సాకిబ్ దెబ్బ.. కోలుకోని ఆర్సీబీ

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని లంక పేసర్ ఈషాన్ మలింగ విడదీశాడు. మలింగ వేసిన షార్ట్ డెలివరీని పుల్ చేయబోయిన వెంకటేష్ అయ్యర్.. అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి 44 పరుగుల వద్ద వెనుతిరిగాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (15) కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ ఉన్నారు. ఆర్సీబీ విజయం సాధించాలంటే ఇంకా 84 బంతుల్లో 181 పరుగులు చేయాల్సి ఉంది.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *